Ranbir Kapoor : యానిమల్ లో చేయడానికి భయపడిన రణ్ బీర్.. అలియా దెబ్బకు ఒప్పుకున్నాడట..

- Advertisement -

Ranbir Kapoor : రణబీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘యానిమల్’ విడుదలకు రెడీ అవుతోంది. డిసెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. హీరో రణబీర్ కపూర్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాపై అంచనాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Ranbir Kapoor
Ranbir Kapoor

పనిలో పనిగా తన భార్య ఆలియా భట్ మీద ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. ‘యానిమల్’ ఈ సినిమా షూటింగ్ సమయంలో తన భార్య ఆలియా నుంచి చాలా సపోర్టు లభించిందని రణబీర్ కపూర్ తెలిపారు. కొన్ని సన్నివేశాల విషయంలో నటుడిగా తనకు చాలా భయం కలిగిందని చెప్పారు. ఆ భయాన్ని దూరం చేయడంలో ఆలియా సాయపడిందన్నారు. “ఆలియా, నేను మా సినిమాల గురించి నిత్యం మాట్లాడుకుంటాం. నటిగా ఆమెను ఎంతో గౌరవిస్తాను. ఆమె ఆలోచించే విధానం కూడా చాలా మెచూర్డ్ గా ఉంటుంది. సినిమా షూటింగ్ కు వెళ్లే సమయంలో ఆమె చర్చిస్తాను. ఆయా సన్నివేశాల్లో ఎలా నటించాలో తను కీలక సూచలను అందిస్తుంది.

ఒక నటుడిగా నేను భయపడిన సన్నివేశాల్లోనూ ఆమె అందించిన సపోర్టును మర్చిపోలేను. ‘యానిమల్’ లాంటి ఇంటెన్స్ సినిమా నేను గతంలో ఎప్పుడూ చేయలేదు. నేను ఎప్పుడూ స్క్రీన్ మీద మంచి తనాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించాను. కానీ, ఇప్పుడు పూర్తి విరుద్ధమైన క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ చేసేందుకు ఆలియా అన్ని విధాలుగా నన్ను ప్రోత్సహించింది. ఈ సినిమా విషయంలో ఆమె బలమైన మద్దతునిచ్చింది” అని వెల్లడించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here