Aishwarya Prabhu : తమిళనాడు లో మంచి సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన హీరోలలో ఒకరు ప్రభు. ఈయన తండ్రి శివాజీ గణేశన్ అప్పట్లో పెద్ద సూపర్ స్టార్. మన టాలీవుడ్ లో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎలాగో, కోలీవుడ్ లో ఎంజీఆర్ మరియు శివాజీ గణేశన్ అలా అన్నమాట. అయితే ఇక్కడ ఎన్టీఆర్, ఏఎన్నార్ కొడుకులు లాగా, అక్కడ ప్రభు పెద్ద సూపర్ స్టార్ ఏమి కాలేదు. ఒక మీడియం రేంజ్ హీరో గానే కొనసాగుతూ వచ్చాడు.
కానీ కెరీర్ లో ఇండస్ట్రీ ని షేక్ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. మన తెలుగు లో విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘చంటి’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. అప్పటి వరకు ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఈ చిత్రం ప్రభు హీరో గా నటించిన ‘చిన్న తంబీ’ కి రీమేక్.
అలా ఒకప్పుడు హీరో గా ఒక మోస్తారుగా రాణించిన ప్రభు, ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్టుగా సౌత్ లో ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. ఇదంతా పక్కన పెడితే ప్రభు కి ఐశ్వర్య ప్రభు అనే ఒక కూతురు ఉంది. ఈమె కూడా అతి త్వరలోనే ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్. చూపులు తిప్పుకోలేని అందం తో, ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్స్ ఎవ్వరికీ తీసిపోనీ విధంగా ఐశ్వర్య ప్రభు ఉండడం విశేషం.
ఇంత అందం పెట్టుకొని ఇన్ని రోజులు ఈమె సినిమాల్లోకి ఎందుకు రాలేదు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈమెకి ఇప్పటికే ఒకసారి పెళ్లి అయ్యింది, కానీ భర్తతో ఏర్పడిన కొన్ని విబేధాల కారణంగా విడిపోవాల్సి వచ్చింది. లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈమె త్వరలోనే యంగ్ డైరెక్టర్ అద్విక్ రవిచంద్రన్ ని పెళ్లి చేసుకోబోతుంది అట.