Bigg Boss : డేంజర్ జోన్ లోకి గౌతమ్..క్షణాల్లో మారిపోతున్న ఈ వారం బిగ్ బాస్ ఓటింగ్ గ్రాఫ్!

- Advertisement -

Bigg Boss : ఈ సీజన్ బిగ్ బాస్ షో క్లైమాక్స్ కి వచ్చేసింది..అంతే కాకుండా ‘ఉల్టా పల్టా’ అనే క్యాప్షన్ కి తగ్గట్టుగా హౌస్ లో సమీకరణాలు రోజు రోజుకి మారిపోతూ ఉన్నాయి. ఈ వారం శివాజీ ని నామినేట్ చేసే విషయం లో తనకి తానూ సెల్ఫ్ గోల్ వేసుకొని అర్జున్ అడ్డం గా దొరికిపోయాడు. సోషల్ మీడియా లో అతనిపై నెగటివిటీ విపరీతంగా పెరిగిపోయింది, కాబట్టి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆయనే అని అందరూ అనుకున్నారు.

Bigg Boss
Bigg Boss

కానీ అర్జున్ ‘టికెట్ టు ఫినాలే’ టాస్కు లో ప్రతీ గేమ్ గెలుస్తూ రావడం , ఆటల్లో తనకి సాటి ఎవ్వరూ లేరని నిరూపించుకోవడం తో పడిపోయిన అతని గ్రాఫ్ మళ్ళీ లేచింది. ఇలా ఓటింగ్ గ్రాఫ్ మొదటి నాలుగు స్థానాలు తప్ప, చివరి మూడు స్థానాలు నిమిషానికి ఒకసారి మారిపోతూ వస్తుంది. ఇప్పుడు చివరి మూడు స్థానాల్లో అర్జున్, గౌతమ్ మరియు శోభా ఉన్నారు.

అర్జున్ కన్నింగ్ స్ట్రాటజీ వాడి జనాలకు ఆ రేంజ్ లో దొరికిపోయిన కూడా అతను డేంజర్ జోన్ నుండి సేఫ్ అవుతున్నాడు అంటే, అతని ఆట తీరు ఆ రేంజ్ లో ఉంది మరీ. ఇకపోతే శోభా శెట్టి కి అమర్ దీప్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆమె బాటమ్ కి రావడం లేదు.

- Advertisement -

ఇక గౌతమ్ గత రెండు మూడు వారాల నుండి గేమ్ సరిగా ఆడకపోవడం, అసలు ఎలాంటి నామినేషన్ పాయింట్స్ లేకపోయినా కూడా ఆయన శివాజీ ని టార్గెట్ చెయ్యడం పెద్ద మైనస్ అయ్యింది. కనీసం అమర్ దీప్ పట్ల బలమైన స్టాండ్ తీసుకొని సపోర్ట్ చేసి ఉండుంటే అతని ఫ్యాన్స్ కూడా గౌతమ్ కి ఓట్ వేసి ఉండేవారు. కానీ అది జరగలేదు. అందుకే ఈ వారం డేంజర్ జోన్ లో గౌతమ్ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here