Alia Bhat : ఏఐ టెక్నాలజీ అనేది వచ్చిన తర్వాత.. ఇది టెక్ ప్రపంచంలో మరో సంచలనాన్ని సృష్టిస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ ఈ ఏఐ టెక్నాలజీతో తయారైన డీప్‌ఫేక్ టెక్నాలజీ.. ప్రస్తుతం సెలబ్రిటీలకు.. ముఖ్యంగా సినీ పరిశ్రమలో పనిచేసే హీరోయిన్లకు పీడకలలాగా మారింది. ఇప్పటికే పలువురు హీరోయిన్లు.. ఈ డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా ఇబ్బందులను ఎదుర్కోగా.. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి ఆలియా భట్ కూడా యాడ్ అయ్యింది. డీప్‌ఫేక్ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అయిన హీరోయిన్ల లిస్ట్తలోకి తాజాగా ఆలియా భట్ పేరు కూడా యాడ్ అయ్యింది. ముందుగా కన్నడ బ్యూటీ రష్మిక మందనా డీప్‌ఫేక్ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారగా.. అది చాలామంది సెలబ్రిటీలను అలర్ట్ చేసింది.
రష్మికకు న్యాయం జరగాలంటూ.. ఇలాంటి టెక్నాలజీ వల్ల ఇంకా ఏ హీరోయిన్లు ఇబ్బందిపడకూడదు అంటూ చాలామంది దీనిని ఖండించారు. కానీ ఒకరి తర్వాత ఒకరుగా హీరోయిన్లు.. ఈ డీప్‌ఫేక్ టెక్నాలజీకి బలవ్వక తప్పలేదు. రష్మిక తర్వాత కాజోల్.. డీప్‌ఫేక్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కత్రినా కైఫ్ కూడా డీప్‌ఫేక్ వల్ల ఇబ్బందులు పడింది. ఇప్పుడు ఆలియా కూడా ఈ లిస్ట్‌లో చేరగా.. మిగతా హీరోయిన్స్‌లో కలవరం మొదలయ్యింది. తాజాగా విడుదలయిన ఆలియా భట్ డీప్‌ఫేక్ వీడియోలో వేరే అమ్మాయి శరీరానికి ఆలియా ఫేస్‌ను టెక్నాలజీ ద్వారా అటాచ్ చేసినట్టు తెలుస్తోంది.
కొద్దిసమయంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినా.. దీనిపై ఆలియా ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఈ వీడియోలో ఆలియా.. బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని కెమెరాను చూస్తూ సైగలు చేస్తున్నట్టుగా ఉంది. దీంతో ఫేస్ స్వాప్ టెక్నాలజీ వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అనేది మరోసారి నిరూపణ అయ్యింది. అందుకే ఇలాంటి టెక్నాలజీని తప్పుగా ఉపయోగించేవారిని శిక్షించాలని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.