Nithiin : పవన్ కల్యాణ్ న్ని చాలామంది హీరోలు వాడుకున్నారు.. టాలీవుడ్ హీరోలను కడిగిపారేసిన నితిన్..

- Advertisement -

Nithiin : 2020లో ‘భీష్మ’ సినిమాతో హిట్ అందుకున్నారు టాలీవుడ్​ హీరో నితిన్. ఆ తర్వాతి ఏడాది చేసిన మూడు సినిమాలు బాక్సాఫీసు మందు హిట్​ టాక్​ తెచ్చుకోలేక పోయాయి. ఇక 2022లో ‘మాచర్ల నియోజక వర్గం’ అనే చిత్రం కూడా అభిమానులను మెప్పించలేక పోయింది. ఈ ఏడాది ‘ఎక్స్​ట్రా ఆర్డినరీ మేన్​’ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అయ్యారు నితిన్. ఈ చిత్రం విడుదలకు రెడీగా ఉన్న నేపథ్యంలో నితిన్ ప్రమోషన్లలో బిజీగా అయిపోయారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నితిన్.. పవర్​ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Nithiin
Nithiin

‘‘నా సినిమాల్లో పవన్‌ కల్యాణ్‌ ఎక్కువగా వాడుతున్నందుకు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కానీ నా కంటే ఎక్కువ మంది హీరోలు వారి చిత్రాల్లో పవన్​ కల్యాణ్​ వాడుకున్నారు. ”ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మేన్‌’లో ఒక సీన్‌లో భాగంగా పవన్ కల్యాన్​లా డ్రెస్‌ వేసుకుని రెడీ అయ్యాను. అంతేగానీ ఫొటోషూట్‌ కోసం అలా చేయలేదు. నేను హీరోనైనా వపన్​కల్యాణ్​కు మాత్రం అభిమానినే. నేను ఎప్పుడూ ఇదే మాట చెబుతాను. నేను ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను’’ అని నితిన్‌ చెప్పారు.

Pawan Kalyan

ఇక ‘ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మేన్‌’ సినిమా విషయానికొస్తే.. నితిన్ హీరోగా వక్కంతం వంశీ ఈ సినిమాను తెరకెక్కించారు. సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. నితిన్ సరసన యంగ్​ బ్యూటీ శ్రీలీల ఆడిపాడింది. చిత్రీకరణ చివరి దర్శలో ఉన్న సినిమా.. ప్రస్తుతం శంషాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో 300మందికి పైగా విదేశీడ్యాన్సర్లతో ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. హ్యారిస్ జయరాజ్​ సంగీతం అందిస్తున్న ఈ సినిమా డిసెంబరు 8న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ చిత్రం ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుందని గతంలో ఓ సందర్భంలో చిత్ర బృందం తెలిపింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here