Bigg Boss : ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా నామినేషన్స్ పర్వం మంచి వాడావేడి వాతావరణం మధ్య జరిగింది. అర్జున్ కి సపోర్ట్ గా నిలిచినందుకు శివాజీని అర్జున్ నామినేట్ చెయ్యడం అందరినీ పెద్ద షాక్ కి గురి చేసింది. అలాగే అమర్ దీప్ కి సపోర్టుగా నిలిచినందుకు ప్రశాంత్ ని అమర్ నామినేట్ చెయ్యడం ప్రశాంత్ ఫ్యాన్స్ ని ఎంతగానో హర్ట్ చేసింది. కానీ ప్రశాంత్ ని అమర్ మంచి ఉద్దేశ్యం తోనే నామినేట్ చేసాడు.
గుడ్డిగా నమ్మి మొన్న నువ్వు స్టోర్ రూమ్ లోకి వెళ్లి డెడ్ అయ్యావ్, నేను నీతో చాలా ఫన్నీ గేమ్స్ ఆడుదాం అనుకున్నాను, అలా గుడ్డిగా ఒకరిని నమ్మి గేమ్ ఆడకు అని అమర్ దీప్ ప్రశాంత్ ని నామినేట్ చేస్తాడు. దీనికి ప్రశాంత్ వెక్కిళ్లు పెట్టి ఏడ్చేస్తాడు. నమ్మకద్రోహం చేసావ్ అన్నా అని అంటాడు. నామినేషన్ చేస్తే నమ్మక ద్రోహం చేసినట్టా, సరే ఫీల్ అవుతున్నావ్ కదా వెనక్కి వెళ్ళిపో అంటాడు.
నేనెందుకు వెళ్తాను అన్నా, నామినేట్ చెయ్యాలనుకున్నావ్ కదా చెయ్యి అని అంటాడు. ఇక ప్రశాంత్ ఈ నామినేషన్ జరిగిన దగ్గర నుండి ప్రతీ ఒక్కరి దగ్గరకి వెళ్లి అమర్ అన్న కోసం అంత పోరాడితే నన్ను సేఫ్ గేమ్ ఆడాడు అని శోభా అక్క అంటుందా అని ప్రతీ ఒక్కరి దగ్గరకి వెళ్లి ఏడుస్తాడు ప్రశాంత్. ఒక పక్క అమర్ అతనితో మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడి ఓదార్చినా కూడా శివాజీ తో చేరి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అనిపించింది.
అలాగే ప్రియాంక మరియు శోభా ఫౌల్ గేమ్ ఆడి అడ్డంగా దొరికిపోయి నామినేషన్ పాయింట్ ఇస్తే, అమర్ దీప్ వాళ్ళని నామినేట్ చెయ్యకుండా, ప్రశాంత్ ని నామినేట్ చెయ్యడం కూడా కరెక్ట్ కాదు అనిపించింది. ఇలా ఈరోజు ఇద్దరి విషయం లో తప్పు ఉంది, కానీ శోభా శెట్టి వల్ల ఇక్కడ అమర్ దీప్ నెగటివ్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్ ఎంతో స్వచ్ఛం గా అమర్ కి సపోర్ట్ చేసాడు అనే విషయం అమర్ కి బాగా తెలుసు. అతనిని అర్థం చేసుకున్నాడు, కానీ శోభా శెట్టి ప్రశాంత్ ని సేఫ్ గేమ్ ఆడాడు అని నామినేట్ చెయ్యడం మాత్రం పెద్ద తప్పు అనే చెప్పాలి.