Jabardasth Faima : ఫైమా.. జబర్దస్త్ ని ఫాలో అయ్యే వారికి ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను నవ్విస్తుంది. మరీ ముఖ్యంగా, ఫైమా బాడీ లాంగ్వేజ్, ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ తో నవ్వకుండా కట్టుకుని కూర్చున్న వారిని కూడా నవ్విస్తాయి. జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఫైమా ఆ తర్వాత బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టార్ మాలో వివిధ షోలలో సందడి చేస్తూనే మళ్లీ జబర్దస్త్ లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో కమెడియన్‌గా ప్రేక్షకులను నవ్విస్తోంది.
తాజాగా ఫైమాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ఆసుపత్రి బెడ్‌పై ఉన్నట్లు కనిపిస్తోంది. ఆమెకు ఏమైంది అంటూ నెటిజన్లు టెన్షన్ పడుతున్నారు. తాజాగా ఫైమా సోషల్ మీడియా వేదికగా వీడియో షేర్ చేసింది. అందులో ఆమె హాస్పిటల్ బెడ్‌పై పేషెంట్ డ్రెస్‌లో కనిపించింది. చేతికి సెలైన్ ఎక్కుతోంది. దీంతో నా గతమంత నే మరిచానే అంటూ ఓ పాటను పోస్ట్ చేసింది. ఫైమా నిరుపేద కుటుంబం నుంచి వచ్చి కమెడియన్‌గా బుల్లితెరపై తనదైన ముద్ర వేసింది. పటాస్ షోకి ప్రేక్షకురాలిగా వెళ్లి కాన్సెప్ట్‌గా నిలిచిన ఫైమా.. తన బాడీ లాంగ్వేజ్, పంచ్‌లు, హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.
పటాస్ నుంచి జబర్దస్త్ వరకు అంచెలంచెలుగా ఎదిగారు. జబర్దస్త్ తనదైన మ్యానరిజం, టైమింగ్‌తో ఆకట్టుకుంది. ఇక బిగ్ బాస్ లో ఛాన్స్ దక్కించుకున్న ఫైమా పది వారాల పాటు కొనసాగింది. ఆ ఇంట్లో ఉంటూనే.. పెద్ద ఇల్లు కట్టడమే తన లక్ష్యమని, ఫైమా హౌస్‌ని వదిలిన తర్వాత తన కలల ఇంటిని నిర్మించుకున్నానని చెప్పింది. తల్లి బీడీ కూలీగా పనిచేసి సంపాదించిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంది. మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచిందని.. అందుకే అమ్మకు ఇల్లు కట్టి ఇవ్వాలని ఫైమా చెప్పింది.
ఫైమా తన ఇంటికి వచ్చిన వీడియోలను తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసింది. అయితే ఆసుపత్రిలో ఎందుకు చేరిందో మాత్రం ఆమె వెల్లడించలేదు. అందుతున్న సమాచారం ప్రకారం ఫైమా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన ఆమె అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.