Prakash Raj : 100 కోట్ల మోసం కేసు.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కు ఈడీ నోటీసులు

- Advertisement -


Prakash Raj ఈ పేరంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు ఆయన. విలక్షణ నటుడిగా ఆయనకు మారు పేరు. ప్రస్తుతం సినిమాలతో పాటు పొలిటికల్ పరంగా కూడా కాస్త బిజీగా ఉన్నారు. తాజాగా ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. 100 కోట్ల విలువైన పొంజీ స్కీం కేసులో భాగంగా ఈయనను ఈడీ అధికారులు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం నవంబర్ 20న తిరుచురాళ్లపల్లికి చెందిన ప్రణయ్ జ్యువెలరీ కి చెందిన ఒక భాగస్వామి సంస్థల్లో ఆస్తుల పైన దర్యాప్తు సోదాలు నిర్వహించి సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Prakash Raj
Prakash Raj

ప్రణవ్ జువెలరీలో బోగస్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ తదితర స్కీములపై దర్యాప్తులో భాగంగా ప్రకాష్ రాజ్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి ప్రణవ్ జువెలరీకి ప్రకాష్ రాజ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయనను వచ్చే వారం చెన్నైలో ఈడీ అధికారులు తమ ఎదుట హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 11.60 కిలోల బంగారం తో పాటు రూ.23.70లక్షలకు విలువైన లెక్కలలో చూపని నగదును సైతం స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ప్రణయ్ జ్యువలరీస్ నిర్వహించిన ఫోంజి పథకం ద్వారా ఈ ఆర్థికంగా ఈ నేరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇది అధికారులు విచారణ ప్రారంభించింది. ప్రస్తుతం జ్యువెలరీలో లాభాలు వస్తున్నాయని బంగారంలో పెట్టుబడి పథకం కింద పేరుతో ప్రజల నుంచి 100 కోట్ల రూపాయలు సైతం వసూలు చేశారన్న వార్తలు వస్తున్నాయి. అయితే ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో పెట్టుబడుదారులు మోసం పోయామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here