Prudhvi Raj : టాలీవుడ్ లో కమెడియన్ గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపుని తెచ్చుకున్న నటుడు పృథ్వి రాజ్. ఒకానొక దశలో ఈయన లేని సినిమా అంటూ లేనేలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన కామెడీ టైమింగ్ తో, మరియు డైలాగ్స్ తో ప్రేక్షకుల చేత కడుపుబ్బా నవ్వించే పృథ్వి రాజ్ ‘ఖడ్గం’ సినిమాతో మంచి పాపులారిటీ ని సంపాదించాడు. ఆ సినిమా లో ’30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’ అంటూ ఆయన చెప్పే డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.
అలా కెరీర్ లో పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే వైసీపీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. కొన్ని అనుకోని సంఘటనలు ఏర్పడడం వల్ల వైసీపీ ని వదిలిన పృథ్వి ప్రస్తుతం జనసేన పార్టీ కోసం పని చేస్తున్నాడు. సినిమాలు మాత్రం గతం తో పోలిస్తే ఇప్పుడు పెద్దగా అవకాశాలు రావడం లేదనే చెప్పాలి.
ఇకపోతే పృథ్వి రాజ్ కి స్రీలు అనే కూతురు ఉంది. ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్నటువంటి హీరోయిన్స్ అందానికి ఏ మాత్రం తీసిపోదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈమె హీరోయిన్ గా కాకుండా ‘రంగుల ప్రపంచం’ అనే సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం అవుతుంది. అంతే కాదు ఈమె ఒక ప్రముఖ స్టార్ హీరో కొడుకుతో చాలా కాలం నుండి డేటింగ్ లో ఉందని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియా లో ప్రచారం సాగుతుంది.
రీసెంట్ గా తన తండ్రి పృథ్వి రాజ్ తో కలిసి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ ఈ విషయం గురించి ప్రస్తావించగా ఆమె సిగ్గుపడడం మనం గమనించొచ్చు. ఇంతకీ స్రీలు ప్రేమిస్తున్న ఆ స్టార్ హీరో కొడుకు ఎవరు అయ్యుంటారు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.