Animal First Review : మన టాలీవుడ్ నుండి మంచి టాలెంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో సందీప్ రెడ్డి వంగ ముందు వరుసలో ఉంటాడు అనడం లో ఎలాంటి అతిశయోకి లేదు. ఇతను ఇప్పటి వరకు కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసాడు. అర్జున్ రెడ్డి మరియు కబీర్ సింగ్. అర్జున్ రెడ్డి కి రీమేక్ గా వచ్చింది కబీర్ సింగ్.

ఈ చిత్రానికి A సర్టిఫికెట్ ఇచ్చినా కూడా 300 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయంటే ఆ సినిమా సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలా కేవలం ఒకే ఒక్క సినిమాతో కల్ట్ ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్న సందీప్ వంగ, ఇప్పుడు ‘ఎనిమల్’ అనే బాలీవుడ్ మూవీ తో మన ముందుకు రాబోతున్నాడు. రణబీర్ కపూర్ మరియు రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 1 వ తారీఖున విడుదల కాబోతుంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కాగా, దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసారు. దీనికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా ఈ సినిమా తెలుగు వెర్షన్ కి సంబంధించిన మొదటి కాపీ ని హైదరాబాద్ కి వచ్చినప్పుడు నిర్మాత దిల్ రాజు కి ప్రత్యేకమైన స్క్రీనింగ్ వేసి చూపించాడట డైరెక్టర్ సందీప్. సినిమా చూసిన వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా ఈ సినిమా రైట్స్ ని కొనుగోలు చేసాడట.

ఈ సినిమా కేవలం బాలీవుడ్ లోనే కాదు, టాలీవుడ్ లో కూడా రికార్డ్స్ ని నెలకొల్పుతుంది, రణబీర్ కపూర్ కి మంచి పేరుని తీసుకొస్తుంది, సినిమాలో ఉన్న ట్విస్టులు, డ్రామా అన్నీ అద్భుతంగా కుదిరాయి, A సర్టిఫికెట్ ఇచ్చారు కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ చిత్రానికి క్యూ కట్టేస్తారు అంటూ దిల్ రాజు పొగడ్తలతో ముంచెత్తాడట. తండ్రి మీద ఉన్న పిచ్చి ప్రేమ, సంఘటనలను బట్టీ ఏ స్థాయికి హీరో ని తీసుకెళ్లింది అనేదే స్టోరీ.
