Vinay Ram : ఆ స్టైలిష్ స్టార్ విలన్ ప్రేమలో మునిగి తేలుతున్న హీరోయిన్.. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నరుగా

- Advertisement -


Vinay Ram : ఇండస్ట్రీలో అందం, టాలెంట్ రెండూ ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక కొంతమంది హీరోయిన్లు కొన్ని సినిమాల్లో మాత్రమే నటించి.. ఆ తర్వాత ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో విమలా రామన్ కూడా ఒకరు.. ఈమె ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన విమలా రామన్ స్వతహా క్లాసికల్ డాన్సర్. సినిమాల మీద ఆసక్తితో ఇండియాకు వచ్చి ఇక్కడే ఉండిపోయింది. 2009లో ఇండస్ట్రీలోకి మొదటిసారి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఎలాగోలా కొన్నేళ్లపాటు బాగానే నెట్టుకొచ్చింది. హీరోయిన్ గా చేసిన సినిమాలు ఏవి కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించింది.

Vinay Ram
Vinay Ram

ఆమె తాజాగా గాండీవధారి అర్జున, రుద్రాంగి తదితర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది విమలా రామన్. ప్రస్తుతం ఈమె వయసు 41 ఏళ్లు. అయినప్పటికీ ఆమె ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. కానీ విలన్ గా మంచి పాపులారిటీ సంపాదించిన నటుడు వినయ్ రామ్ తో కలిసి గత కొన్నేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి దిగినటువంటి కొన్ని ఫోటోలను వారు షేర్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Vimala raman

విమలా రామన్.. వినయ్ రామ్ తో కలిసి ఇన్ స్టా గ్రామ్ లో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసి.. వారి మధ్య ఉన్న రిలేషన్ షిప్ ని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాలు లేకపోయినా ఏదో ఒక విషయంలో మాత్రం విమలా రామన్ వైరల్ గా మారుతూనే ఉంటుంది. మరి ప్రియుడితో పెళ్లి విషయంపై త్వరలో క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ఈ అమ్మడు తెలుగులో పరిచయమైన సమయంలో స్టార్ హీరోయిన్ గా అయ్యేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అనిపించినా తాను ఎంచుకున్న కథల విషయంలో చేసిన పొరపాట్ల కారణంగా కెరీర్ డౌన్ ఫాల్ అయింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here