Amani : సీనియర్ హీరోయిన్ ఆమని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించి అప్పట్లో అగ్ర హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు. పెళ్లి చేసుకుని ప్రస్తుతం కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుసగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రానిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ ఆమెకు దర్శకనిర్మాతలు వరుసగా ఆఫర్లు ఇస్తుండడంతో తాను బిజీ కెరీర్ మెయింటైన్ చేస్తున్నారు. ఇలా హీరోయిన్ గా ఒకానొక సమయంలో స్టార్ హీరోల అందరి సినిమాల్లో నటించిన ఆమని తాజాగా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలను బయటపెట్టారు. తాను క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అంటూ కుండబద్ధలు కొట్టారు.

చాలామంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని అంటుంటారు. ఆమని మాట్లాడుతూ.. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విధమైనటువంటి ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉంటాయని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. సినిమా అవకాశాల కోసం తాను ఫోటోలను పంపగా వారు ఆడిషన్ అని చెప్పి అక్కడ అమ్మాయిల రంగు తక్కువగా ఉందంటూ చాలా మంది హేళన చేసే వారని చెప్పింది. మరికొన్నిసార్లు ఫోన్ చేసి చెప్తామని ఫోన్ నెంబర్లు తీసుకొని విసిగించేవారని చెప్పింది ఆమని.

అలాగే సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంతమంది దర్శక నిర్మాతలు అవకాశం ఇచ్చి బోల్డ్ సన్నివేశాలలో నటించమని చెప్పేవారట.. అలాంటి సన్నివేశాలలో నటించేటప్పుడు మీ శరీరం పైన ఎక్కడ కూడా మార్క్స్ ఉండకూడదని.. అలా ఎక్కడైనా ఏమైనా ఉన్నాయా అని చూడనివ్వండి అంటూ చాలా అసభ్యకరంగా మాట్లాడే వారిని ఆమని తెలిపింది. తనతో కూడా ఈ విషయంలో చాలామంది ఇలాగే ప్రవర్తించారని.. కాకపోతే ఈ విషయాలు తెలుసుకొని వాళ్ల నుంచి తప్పించుకున్నానని తెలిపింది. అలా క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆమని చెప్పడం చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.