Sankranti movies : కొన్ని క్లాస్.. కొన్ని ఊరమాస్.. పంచ్ డైలాగ్‌లతో సంక్రాంతికి పూనకాలే

- Advertisement -

Sankranti movies : సంక్రాంతి సందడి ఈసారి కాస్త ముందుగానే మొదలైంది. బాక్సాఫీస్ వద్ద పండుగ హడావుడి ఈ ఏడాది కాస్త త్వరగానే వచ్చింది. జనవరి 11,12,13,14.. ఇలా ఒక్కో రోజు ఒక్కో అగ్ర హీరో సినిమా విడుదలతో ఈ ఏడాది సంక్రాంతి సంబురం డబుల్ కాబోతోంది. తమిళ్ స్టార్ హీరోలు ఈ ఏడాది పండుగ సంబురం షురూ చేస్తుండగా.. టాలీవుడ్ సీనియర్ స్టార్స్ సినిమాలతో జోరు మరింత పెరగనుంది. ముందుగా అజిత్‌ ‘తెగింపు’, తర్వాత బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’, ఈ తర్వాత చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, చివరిగా విజయ్‌ ‘వారసుడు’ సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Sankranti movies
Sankranti movies

టీజర్‌, ట్రైలర్లలో వినిపించిన డైలాగ్స్ ఆయా హీరోల అభిమానులు, ప్రేక్షకుల్లో సినిమాలపై ఆసక్తి పెంచాయి. ‘వీరసింహారెడ్డి’లో ఎక్కువగా ఊరమాస్‌, మిగిలిన వాటిలో పవర్‌ఫుల్‌+ క్లాస్‌ సంభాషణలకు ఇప్పటికే ‘చప్పట్లు’ మోగాయి. థియేటర్లలో ‘విజిల్స్‌’ పడడమే తరువాయి. మరి ఈ సంక్రాంతికి దుమ్మురేపే ఆ డైలాగ్స్ ఏంటో మనమూ ఓసారి చూద్దామా..?

వీరసింహారెడ్డి బాధ్యత అదే..

- Advertisement -

సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదనే నేను ఒక్కడినే కత్తి పట్టా. పరపతి కోసమే, పెత్తనం కోసమే కాదు.. ముందు తరాలు నాకు ఇచ్చిన బాధ్యత.

నాది ఫ్యాక్షన్‌ కాదు.. సీమ మీద ఎఫెక్షన్‌.

వీరసింహారెడ్డి.. పుట్టింది పులిచర్ల, చదివింది అనంతపురం, రూలింగ్‌ కర్నూలు.

సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు.

పదవి చూసుకుని నీకు పొగరేమో.. బై బర్త్‌ నా డీఎన్‌ఏకే పొగరెక్కువ.

పది నిమిషాల్లో క్లోజ్‌ అయ్యే ఏ పబ్‌ దగ్గరకైనా వెళ్లు.. అక్కడ నీకు ఒక స్లోగన్‌ వినిపిస్తుంది (జై బాలయ్య).

అపాయింట్‌మెంట్‌ లేకుండా వస్తే అకేషన్‌ చూడను, లొకేషన్‌ చూడను ఒంటి చేత్తో ఊచకోత కోస్తా.

మీ జీవో గవర్నమెంట్‌ ఆర్డర్‌.. నా జీవో గాడ్స్‌ ఆర్డర్‌.

భయం నా బయోడేటాలోనే లేదురా.

నరకడం మొదలుపెడితే ఏ పార్ట్‌ ఏదో మీ పెళ్లాలకు కూడా తెలియదు.

ఈ వాల్తేరు వీరయ్య.. పక్కా లోకల్‌

మీ కథలోకి నేను రాలా.. నా కథలోకే మీరందరూ వచ్చారు.

వీడు నా ఎర.. నువ్వే నా సొర.

రికార్డ్స్‌లో నా పేరు ఉండడం కాదు. నా పేరు మీదే రికార్డ్స్‌ ఉంటాయ్‌.

ఈ సిటీకి నీలాంటి కమిషనర్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ ఇక్కడ వీరయ్య లోకల్‌.

ఫస్ట్‌టైమ్‌ ఒక మేక పిల్లను ఎత్తుకుని పులే వస్తాండాది.

సంక్రాంతి వారసుడు

ఇన్‌ బిజినెస్‌ ఆల్వేస్‌ బీ అలర్ట్‌. వేటగాడు తన కళ్లల్లో మట్టి పడినా కళ్లు తెరిచే ఉంచాలి.

వేటగాడికి వేటే వృత్తి. వెళ్లి మీ నాన్నకు చెప్పు ఈ సీట్‌లో హీట్‌ ఏంటో ఇకపై చూస్తాడు (విలన్‌ వెర్షన్‌)

పవర్‌ సీట్‌లో ఉండదు సర్‌. అందులో వచ్చి ఒకడు కూర్చుంటాడే వాడిలో ఉంటుంది. మన పవర్‌ ఆ రకం.

ప్రేమో, భయమో నాకిచ్చేటప్పుడు కొంచెం ఆలోచించి ఇవ్వు. ఎందుకంటే నువ్వు ఏది ఇచ్చినా నేను దాన్ని ట్రిపుల్‌గా ఇచ్చేస్తాను. నా గురించి నీకు తెలియదు కదా.

గ్రౌండ్‌లో ఎంతమంది ప్లేయర్స్‌ అయినా ఉండొచ్చు. కానీ ఆడియన్స్‌ అంతా ఒక్కడిని మాత్రమే చూస్తారు. ఎవరినో తెలుసా?.. ఆట నాయకుణ్ని.

ఇల్లు అనేది ఇటుక, ఇసుకేరా వదిలేసి వెళ్లిపోవచ్చు. కుటుంబం అలా కాదుగా.

కుటుంబం అన్నాక లోపాలుంటాయ్‌. కానీ మనకంటూ ఉండేది ఒకే ఒక కుటుంబం.

అజిత్‌ తెగింపు అదిరిందిగా..

ఒక దొంగ బ్యాంక్‌లోకి ఎంటరైతే లోపల ఉన్నవాళ్లు ఏం చేయాలంటే.. రూల్‌ నంబరు 1: హీరోలా నటించొద్దు. ఆ పని నేను చూసుకుంటా.

బ్యాంక్‌లోకి వచ్చి బీరు, బ్రాందీ అడుగుతారా?

బుద్ధున్నోడెవడైనా నాలాంటి కంత్రిగాడితో పెట్టుకుంటాడా?

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com