Bigg Boss OTT Season 2 : ఈమధ్యనే ప్రారంభం అయ్యింది అన్నట్టుగా అనిపిస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 అప్పుడే చివరి దశకి వచ్చేసింది. ఆద్యంతం ఉత్కంఠభరితమైన టాస్కులు, ఫన్ మరియు ఎంటర్టైన్మెంట్ తో ఈ సీజన్ ఇప్పటి వరకు ప్రసారమైన సీజన్స్ అన్నిట్లో కూడా ది బెస్ట్ అనిపించుకుంది. టీఆర్ఫీ రేటింగ్స్ కూడా రికార్డు స్థాయిలో వస్తున్నాయి. అయితే ఈ సీజన్ మరో రెండు వారాలు పొడిగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ పూర్తయిన కొద్దీ రోజులకే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ప్రారంభం కాబోతుంది. డిస్నీ + హిట్స్ స్టార్ యాప్ లో ప్రసారమయ్యే ఈ ఓటీటీ సీజన్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొదటి సీజన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా బిందు మాధవి నిలవగా, రన్నర్ గా అఖిల్ సార్థక్ నిలిచాడు.

ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ లో అంతకు ముందు టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన సీజన్స్ లోని కంటెస్టెంట్స్ కూడా ఉంటారట. ముఖ్యంగా సీజన్ 7 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి మొదటి వారం లోనే హౌస్ నుండి బయటకి వెళ్లిపోయిన కంటెస్టెంట్ నాయని పావని. ఈమెకి ఓటీటీ రెండవ సీజన్ లో పాల్గొనే ఛాన్స్ దక్కింది అట.

అలాగే సీజన్ 2 టైటిల్ విన్నర్ కౌశల్, సీజన్ 7 కంటెస్టెంట్ ఆట సందీప్, ఫైమా,శ్రీ సత్య , డాన్ పృథ్వి, జబర్దస్త్ నరేష్, వర్ష తదితరులు ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొనేందుకు సిద్ధం గా ఉన్నారట. అతి త్వరలోనే ఈ సీజన్ కి సంబంధించిన ప్రారంభ తేదీ మరియి టైమింగ్స్ ని తెలియచేస్తారట. మరి ఈ సీజన్ కి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తాడా?, లేదా వేరే ఎవరైనా హోస్ట్ గా వ్యవహరిస్తాడా అనేది తెలియాల్సి ఉంది.