Santhanam : మన సౌత్ ఇండియా లో అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న కమెడియన్స్ లిస్ట్ తీస్తే అందులో సంతానం పేరు ముందు వరుసలో ఉంటుంది. పేరుకి ఇతను తమిళ కమెడియన్ కానీ, ఇతను కామెడీ కి తెలుగు ఆడియన్స్ కూడా పగలబడి నవ్వుతారు. ఇప్పటి వరకు ఆయన డైరెక్ట్ తెలుగు సినిమా ఒక్కటి కూడా చెయ్యలేదు. కారణం ఏమిటో తెలీదు కానీ, తమిళ డబ్బింగ్ సినిమాలతోనే ఆయన తెలుగునాట అశేష ప్రజాధారణ పొందాడు.
అయితే ఈమధ్య సంతానం ఏమయ్యాడు?, ఒక్క సినిమాలో కూడా కనిపించట్లేదే, ఏమైంది ఇతనికి అని మన తెలుగు వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు. కానీ సంతానం కమెడియన్ రోల్స్ నుండి హీరో రోల్స్ కి షిఫ్ట్ అయ్యి చాలా కాలమే అయ్యింది. హీరో గా ఆయనకీ రెండు మూడు సూపర్ హిట్స్ కూడా ఉన్నాయి. అందుకే రెమ్యూనరేషన్స్ కూడా స్టార్ హీరో రేంజ్ లో డిమాండ్ చేస్తున్నాడు సంతానం.
ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో సంతానం ఒక్కో సినిమాకి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి చెప్పుకొచ్చాడు. సంతానం ప్రస్తుతం తమిళనాడులో హీరో గా రాణిస్తున్నాడు. ఈయన హీరో గా చేసే సినిమాకి మూడు నుండి 5 కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నాడు. భవిష్యత్తులో ఆయన 30 కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ కి ఎదగాలని కోరుకుంటున్నాడు.
ప్రస్తుతం సంతానం కమెడియన్ రోల్స్ చేసే పరిస్థితి లేదని, ఒకవేళ చెయ్యాల్సి వస్తే ఆయన రోజుకి 13 లక్షల రూపాయిలు ఛార్జ్ చేస్తాడని చెప్పుకొచ్చాడు. సంతానం ఇప్పుడు తీసుకునే రెమ్యూనరేషన్ కొంత మంది తమిళ హీరోలు కూడా తీసుకోవడం లేదని , త్వరలోనే ఆయన స్టార్ హీరో రేంజ్ కి కచ్చితంగా వెళ్తాడు అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.