Mangalavaram : అందం తో పాటుగా అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ, పాపం కాలం కలిసిరాక కొంతమంది హీరోయిన్లు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నారు. అలాంటి హీరోయిన్స్ జాబితా తీస్తే అందులో పాయల్ రాజ్ పుత్ కచ్చితంగా ఉంటుంది. ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ తొలిసినిమా తోనే సూపర్ హిట్ అందుకుంది.
ఎవరీ అమ్మాయి ఇంత బాగుంది, యాక్టింగ్ కూడా అదరగొట్టేసింది, భవిష్యత్తులో పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు. రీసెంట్ గా ఈమె ‘మంగళవారం’ అనే చిత్రం తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ, అనుకున్న స్థాయిలో మాత్రం వసూళ్లు రావడం లేదు. ఈ చిత్రం లో పాయల్ రాజ్ పుత్ నటన కి కూడా మంచి మార్కులు పడ్డాయి.
కానీ కమర్షియల్ గా వసూళ్లు మాత్రం అనుకున్న స్థాయిలో లేవు. అందుకు కారణాలు ఏమిటో అర్థం కావడం లేదు, ఆమె దురదృష్టం అని అనుకోవాల్సిందే. కానీ అనుకున్న స్థాయి వసూళ్లు రాకపోయినా ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అవుతుందని అంటున్నారు. ఆదివారం రోజు వసూళ్ల పై భారీ ఆశలు పెట్టుకున్నారు కానీ, వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రభావం బలంగా పడడం వల్ల వసూళ్లు దెబ్బతిన్నాయి.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ విడుదల తేదీ అప్పుడే బయటకి వచ్చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 10 వ తారీఖున ఈ చిత్రం అన్నీ ప్రాంతీయ భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది. థియేటర్స్ లో అనుకున్న స్థాయి రెస్పాన్స్ రాకపోయినా కూడా, ఓటీటీ లో మాత్రం ఈ చిత్రానికి దక్కాల్సిన రెస్పాన్స్ దక్కుతుందని ఈ చిత్రాన్ని చూసిన వాళ్ళు చెప్తున్నారు.