Bigg Boss : బిగ్ షాక్.. యావర్ నుండి ‘ఏవిక్షన్ పాస్’ ని వెనక్కి తీసేసుకున్న నాగార్జున..!

- Advertisement -

Bigg Boss : ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా బిగ్ బాస్ హౌస్ ఎంతో ఆసక్తికరమైన టాస్కులతో ముందుకు దూసుకుపోయింది. ఈ వారం అమర్ దీప్ మరియు ప్రియాంక కి బాగా కలిసొచ్చింది అనే చెప్పాలి. ప్రియాంక ఇంటి కెప్టెన్ అయ్యింది, అలాగే అమర్ దీప్ ని స్నేహితులు అనుకున్న వాళ్ళు ఎలా ఆయనకీ వెన్నుపోటు పొడవడం బాగా ప్లస్ అయ్యింది. కానీ శివాజీ బ్యాచ్ కి మాత్రం బాగా మైనస్ అయ్యింది.

Bigg Boss
Bigg Boss

ముఖ్యంగా యావర్ ఈ వారం ఆడిన ఫౌల్ గేమ్స్, తద్వారా ఆయన గెలుచుకున్న ‘ఏవిక్షన్ పాస్’ అతని పై నెగటివిటీ ఒక రేంజ్ లో పెంచేలా చేసింది. ఎందుకంటే మొదటి నుండి అతను అమర్ దీప్ ఫౌల్ గేమ్ ఆడుతున్నాడు అంటూ కామెంట్స్ చేసేవాడు. అమర్ దీప్ ఎన్ని ఫౌల్ గేమ్స్ ఆడాడో తెలియదు కానీ, ఈ వారం యావర్ ఆడినన్ని ఫౌల్ గేమ్స్ ఎవ్వరూ ఆడలేదు అని చెప్పాలి.

ఇక పోతే ఈ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున యావర్ ఆడిన ఫౌల్ గేమ్స్ మొత్తం వీడియో వేసి చూపించాడు. దెబ్బకి యావర్ కి నోటి నుండి మాట రాలేదు. ఆ తర్వాత యావర్ ‘క్షమించండి సార్..నేను ఇది కావాలని చెయ్యలేదు, ఎదో అలా జరిగిపోయింది’ అని అంటాడు. అప్పుడు నాగార్జున దీనికి శిక్ష ఏమి ఇవ్వమంటావో నువ్వే చెప్పు అని అనగా, యావర్ ‘ఈ ఏవిక్షన్ పాస్ ని వెనక్కి ఇచ్చేస్తాను సార్’ అంటాడు.

- Advertisement -

అప్పుడు ఆ ఏవిక్షన్ పాస్ ని స్టోర్ లో భద్రంగా దాచుతారు. వచ్చే వారం లో మళ్ళీ ‘ఏవిక్షన్ పాస్’ గేమ్ లో పెడుతారో లేదో, లేకపోతే అసలు ఈ సీజన్ మొత్తానికే ఈ టాస్కు ని రద్దు చేసారో అనేది తెలియాలి. హౌస్ లో దాదాపుగా అందరికీ కోటింగ్ పడింది, ఒక్క ప్రియాంక కి తప్ప.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here