Rashmika : రష్మిక మార్ఫింగ్ వీడియోపై మాజీ లవర్ స్పందన.. అలాంటివి కచ్చితంగా ఉండాలిట..

- Advertisement -

Rashmika : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మార్ఫింగ్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. రష్మిక డీప్ ఫేక్ వీడియోపై టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ స్టార్స్, పొలిటీషియన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్ఫింగ్ వీడియో చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తాజాగా దీనిపై ఆమె మాజీ లవర్ రక్షిత్ స్పందించాడు.

Rashmika
Rashmika

ఓ ఇంటర్వ్యూలో.. రష్మిక ఫేక్ వీడియో ఘటనపై రెస్పాండ్ అయ్యాడు. ‘నిజానికి ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరముంది. ఎలాంటి సాఫ్ట్‌వేర్ తయారు చేసినప్పటికీ దానికి ఓ లైసెన్స్ ఉండాలి. అలాంటి రూల్స్ వచ్చినప్పుడే ఇలాంటి వాటిని అడ్డుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి సాఫ్ట్‌వేర్స్‌ని చాలామంది ఉపయోగిస్తున్నారు. వాటిని అరికట్టకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువవ్వొచ్చు. అయితే రష్మిక కెరీర్ కోసం ఎన్నో డ్రీమ్స్ అనుకున్న అమ్మాయి’ అని రక్షిత్ చెప్పుకొచ్చాడు.

Rashmika

కాగా 2017లో ‘కిరిక్ పార్టీ’ అనే సినిమాతో కన్నడ సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది రష్మిక మందన్న. ఆ మూవీకి ‘కాంతారా’ ఫేమ్ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించగా రక్షిత్ శెట్టి, రష్మిక జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్ టైంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించి ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. 2017 లోనే వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత 2018 లో తమ ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకుని తిరిగి సినిమాల్లో బిజీ అయ్యారు. వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ బ్రేక్ అవ్వడానికి అసలు కారణాలు ఏంటో ఇప్పటికీ తెలియదు. కానీ మీడియా వర్గాలు మాత్రం వాళ్ళిద్దరి బ్రేకప్ పై రకరకాల రూమర్స్ వినిపించాయి. ప్రజెంట్ ఈ ఇద్దరూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here