mangalavaram first review : ఇలాంటి బోల్డ్ కంటెంట్ ని ఎప్పుడూ చూసుండరు!

- Advertisement -

mangalavaram first review : రీసెంట్ సమయం లో ట్రైలర్ తోనే ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షించిన చిత్రాలలో ఒకటి ‘మంగళవారం’. ‘RX 100’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి, ఆ సినిమాలోని హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ని ప్రధాన పాత్రలో పెట్టి చేసిన చిత్రమిది. నవంబర్ 17 వ తారీఖున గ్రాండ్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

mangalavaram first review
mangalavaram first review

‘RX 100’ చిత్రం తో యూత్ లో మంచి క్రేజ్ ని దక్కించుకున్న పాయల్ రాజ్ పుత్ కి ఇప్పటి వరకు సరైన సక్సెస్ రాలేదు. హీరోయిన్ గా అవకాశాలు బాగానే వచ్చాయి కానీ అన్నీ చిన్న హీరోల సినిమాలే. వెంకటేష్ మరియు రవితేజ వంటి స్టార్స్ తో సినిమాలు చేసింది కానీ, ఆ చిత్రాలు కూడా పాయల్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు. ‘మంగళవారం’ చిత్రం ఆమె కెరీర్ కి పెద్ద ప్లస్ అవుతుంది అని ఆమె బలంగా అనుకుంటుంది.

Payal rajput

అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షో ని నేడు ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది సినీ ప్రముఖులు మరియు మీడియా మిత్రులను ఆహ్వానించి ప్రత్యేక షో ని ఏర్పాటు చేసారు. ఈ షో నుండి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇంత సర్ప్రైజ్ ఎలిమెంట్స్ తో, ఇంత బోల్డ్ గా ఈమధ్య కాలం లో ఏ సినిమాలో కూడా చూడలేదని, చివరి 30 నిమిషాలు మాత్రం మన మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, సరైన టాక్ ఆడియన్స్ లోకి వెళ్తే ఈ సినిమా సృష్టించే అద్భుతాలు ఊహాతీతం అంటూ చూసిన ప్రతీ ఒక్కరు అజయ్ భూపతి ని పొగడ్తలతో ముంచి ఎత్తారట. అలాగే ఈ సినిమా నటించే సాహసం పాయల్ రాజ్ పుత్ తప్ప, టాలీవుడ్ లో ఎవ్వరూ సాహసం చెయ్యలేరని, అంత బోల్డ్ గా ఈ చిత్రం లో ఆమె నటించింది అనే టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే 17 వ తారీఖు వరకు ఆగాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here