Bigg Boss Telugu : ‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ గేమ్ లో వరుసగా మూడు టాస్కులు గెలిచిన యావర్.. ఇది కదా కం బ్యాక్ అంటే!

- Advertisement -

Bigg Boss Telugu : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ టాస్కులోను మొదటి వారం నుండి నూటికి నూరు శాతం తన బెస్ట్ ఇస్తూ వచ్చిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది యావర్ అనే చెప్పాలి. హౌస్ లో ఉన్న ప్రతీ కంటెస్టెంట్ ఆడియన్స్ కి ఎంతో కొంత సుపరిచితమే, కానీ యావర్ మాత్రం ఎవరికీ తెలియదు.

Bigg Boss Telugu
Bigg Boss Telugu

సున్నా ఫ్యాన్ బేస్ తో హౌస్ లోకి అడుగుపెట్టిన యావర్, తన ఆట తో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకొని స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఇన్ని రోజుల నుండి హౌస్ లో కొనసాగుతున్నాడు. అయితే రతికా రీ ఎంట్రీ తర్వాత యావర్ గేమ్ మొత్తం పోయిందని, ఆట మీద ద్రుష్టి పెట్టకుండా కేవలం రతికా మీద మాత్రమే ద్రుష్టి పెట్టాడని, ఎలా ఆడాల్సిన యావర్ ఎలా ఆడుతున్నాడో అంటూ ఆయన అభిమానులు బాగా హర్ట్ అయ్యారు.

Yaawar

అయితే ప్రతీ వీకెండ్ నాగార్జున సార్ తో యావర్ బాగా ఆడడం లేదు, గేమ్ డౌన్ అయిపోతుంది అని అనిపించుకోవడం కామన్ అయ్యి యావర్ లో నేడు ఫైర్ రగిలిందో ఏమో తెలియదు కానీ. నేడు బిగ్ బాస్ నిర్వహించిన ‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ గేమ్ లో చెలరేగిపోయి మరీ ఆడాడు. ఒక్కటి కాదు , రెండు కాదు వరుసగా మూడు గేమ్స్ గెలిచి బీభత్సమైన కం బ్యాక్ ఇచ్చాడు యావర్.

- Advertisement -
Bigg Boss Telugu  yaawar

ఆయన ఆట తీరుని చూసి అభిమానులు ఇది కదా యావర్ గేమ్ అంటే, ఇన్ని వారాలు మేము మిస్ అయ్యింది ఈ ఆటనే అంటూ యావర్ పై సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు నెటిజెన్స్. గత నాలుగు వారాల నుండి పాతాళ లోకం లోకి పడిపోయిన యావర్ గ్రాఫ్, ఈ వారం ఈ ఆటతో అమాంతం పెరిగిపోయింది. ఇదే రేంజ్ జోష్ ని ముందు వారాల్లో కూడా కొనసాగిస్తాడో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here