SaiDharam Tej : మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తన లాస్ట్ సినిమా విరూపాక్ష సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. తన కెరీర్లో ఫస్ట్ రూ.100కోట్లు కలెక్షన్లను సాధించిన సినిమాను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. అదే జోష్‌తో వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం గంజాయ్ శంకర్ మూవీలో నటిస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇటీవల తన మేనమామ పవన్ కళ్యాణ్ కలిసి బ్రో సినిమాలో నటించి మెప్పించాడు. ఈ సినిమా కూడా ఓ మోస్తారు హిట్ అయింది. సాయి తేజ్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. అప్పుడప్పుడు అభిమానులతో ఆస్క్ మీ సెషన్ నిర్వహిస్తుంటారు. ఇక నిన్నటితో సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీ లోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో తేజ్ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం విజయవంతం కావడంతో ఆయనకు మరిన్ని అవకాశాలు వచ్చాయి.

ఇక ఇండస్ట్రీకి వచ్చి తొమ్మిదేళ్లు అయిన సందర్భంగా వరుణ్ తేజ్ ఫ్యాన్స్ తో చిట్ చాట్ సెషన్ నిర్వహించాడు. ఇందులో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. కొందరు నెటిజన్స్ చేసిన తలతిక్కగా చేసిన కామెంట్స్ కు తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చిపడేశాడు. అందులో భాగంగా తేజ్‌ను ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన పాత్రలు ఏంటి అని ప్రశ్న అడగగా.. చిత్రలహరి, రిపబ్లిక్ ఈ రెండు సినిమాల్లో నా రోల్ చాలా సంతృప్తిని ఇచ్చిందంటూ చెప్పుకొచ్చాడు. అందులో రిపబ్లిక్ స్పెల్లింగ్ తప్పు పడడంతో ఓ నెటిజన్ కాస్త ఘాటుగా కామెంట్ చేశాడు.

అది రిలబ్లిక్ కాదురా బుర్ర తక్కువ వెదవ.. నీ ముఖానికి ఎప్పుడైనా స్కూల్ కి వెళ్లావా అంటూ రాసుకొచ్చాడు. అందుకు సాయి తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చాడు. నువ్వు చెప్పింది కరెక్టే.. మా స్కూల్లో గౌరవం కూడా నేర్పించారు.. నీకు మీ స్కూల్లో నేర్పించి ఉండరు.. లేకపోతే నేర్చుకో.. అంటూ కామెంట్స్ చేశాడు. ఇక్కడ అలా కామెంట్ చేసింది కూడా ఆయన ఫ్యాన్ కావడం గమనార్హం. ఇక తేజ్ రిప్లైకి ఆ ఫ్యాన్ స్పందిస్తూ రిప్లై ఇవ్వట్లేదని అలా పెట్టా.. క్షమించని అడిగాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.