Sai Dharam Tej : వరుణ్ తేజ్ వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. గత కొంత కాలంగా నటి లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్న ఆయన పెళ్లి చేసుకున్నారు. తాజాగా లావణ్య వరుణ్ తేజ్ వివాహం జరగడంతో మెగా ఫ్యామిలీలో ఇంకా సింగిల్ గా ఉన్న హీరో సాయి ధరంతేజ్ పై పెళ్లి ఒత్తిడి పెరిగిందని అంటూ సాయి ధరంతేజ్ చేసినపోస్ట్ వైరల్ గా మారింది.

ఇక మెగా హీరో సాయి ధరంతేజ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ఆస్క్ సాయి ధరమ్ తేజ అనే ఒక సెషన్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఒక అభిమాని బ్రో నీ పెళ్ళెప్పుడు అని అడిగితే దానికి సాయి ధరమ్ తేజ్ ఆసక్తికరంగా స్పందించాడు నీకు అయిన వెంటనే అని తెలివిగా ఆన్సర్ ఇచ్చాడు. సాయి ధరమ్ తేజ సోషల్ మీడియా వేదికగా వరుణ్ తేజ్ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఎందుకు, వై, క్యో, ఎన్ ? ఎంత పని చేశావ్ రా వరుణ్ బాబు, నీకు పెళ్లి సంబరాలు, నాకు స్వతంత్ర పోరాటం అంటూ తేజు ఫన్నీ పోస్ట్ పెట్టాడు.

ఇది కూడా వైరల్ గా మారి నెటిజన్లను ఆకర్షించింది. స్వతంత్ర పోరాటం అంటే నేను సింగిల్ గా ఉండేదుకు పోరాడుతున్నా అని పరోక్షంగా తేజు ఈ పోస్టు ద్వారా కామెంట్ చేసినట్టు అర్ధం అవుతోంది. వయసులో వరుణ్ కంటే సాయి ధరమ్ తేజ్ పెద్ద అయినప్పటికీ ఇంకా సాయిధరమ్ తేజ సింగిల్గానే ఉన్నా వరుణ్ పెళ్లి కావడంతో ఈయనని కూడా పెళ్లి చేసుకోవాలని సలహా ఇస్తున్నారట.