Allu Arjun : పాకిస్తాన్ లో అల్లు అర్జున్ కి ఇంత క్రేజ్ ఉందా..? ఇక్కడ ‘పుష్ప’ ఎంత వసూళ్లను రాబట్టిందో తెలుసా!

- Advertisement -

Allu Arjun : మన టాలీవుడ్ నుండి ఇతర రాష్ట్రాల్లో మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాప్ 3 హీరోల లిస్ట్ తీస్తే అందులో అల్లు అర్జున్ పేరు ముందు వరుసలో ఉంటుంది. రాజమౌళి తర్వాత ఇతర రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ బ్రాండ్ ఏదైనా ఉందా అంటే అది అల్లు అర్జున్ బ్రాండ్ మాత్రమే. ఈ బ్రాండ్ ఇమేజి ఆయనకీ పుష్ప సినిమాతో వచ్చింది అనుకుంటే పొరపాటే.

Allu Arjun
Allu Arjun

తన అద్భుతమైన డ్యాన్స్ టాలెంట్ తో అల్లు అర్జున్ ‘ఆర్య 2 ‘ చిత్రం నుండే పాన్ ఇండియా లెవెల్ లో ఫేమస్. ఆ తర్వాత ఆయన హిందీ డబ్బింగ్ సినిమాలకు యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఎప్పుడైతే ‘పుష్ప’ సినిమా విడుదల అయ్యింది, అల్లు అర్జున్ కి నార్త్ మార్కెట్ లో అక్కడి స్టార్ హీరోలతో సరిసమానమైన క్రేజ్ ఏర్పడింది. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది.

కేవలం మన ఇండియా లోనే కాదు, అల్లు అర్జున్ కి పాకిస్థాన్ మరియు బాంగ్లాదేశ్ వంటి ప్రాంతాలలో కూడా మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా పాకిస్థాన్ లో అయితే బాలీవుడ్ హీరోల తర్వాత అత్యంత క్రేజ్ ని దక్కించుకున్న హీరో అల్లు అర్జున్ మాత్రమేనట. బాలీవుడ్ హీరోల సినిమాలతో పాటుగా అల్లు అర్జున్ సినిమాలు కూడా అక్కడ థియేటర్స్ లో విడుదల అయ్యాయి అట.

- Advertisement -

అక్కడి ఆడియన్స్ కి కూడా పుష్ప సినిమా తెగ నచ్చేసినట్టు సమాచారం. ఈ చిత్రం అక్కడ ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం దాదాపుగా 12 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అట. ఇది సాధారమైన విషయం కాదు, ప్రస్తుతం అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న ‘పుష్ప’ సీక్వెల్ ‘పుష్ప ది రూల్’ కోసం పాకిస్థాన్ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారట. ఈ చిత్రం తర్వాత ఆయన రేంజ్ ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here