Amar Deep : ఈ సీజన్ బిగ్ బాస్ షో ఎవ్వరూ ఊహించని మలుపులతో ముందుకు దూసుకుపోతుంది. ‘ఉల్టా పల్టా’ కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చిన ఈ సీజన్ కేవలం టాస్కుల విషయం లో మాత్రమే కాదు, ఆడియన్స్ ఓటింగ్ విషయం లో కూడా ‘ఉల్టా పల్టా’ అవుతుంది. ఈ సీజన్ లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో టాప్ 5 స్థానం లో బెర్త్ ఖరారు చేసుకున్న వ్యక్తి అమర్ దీప్. ఇతని మీద ప్రారంభం లో ఆడియన్స్ లో చాలా అంచనాలు ఉండేవి.

ఎందుకంటే ఇతను అంతకు ముందు నుండే బుల్లితెర మీద ఎంటర్టైన్మెంట్ షోస్ లో మంచి టాలెంట్ ఉన్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి కంటెస్టెంట్ మొదటి 5 వారాలు అతని రేంజ్ లో గేమ్స్ ఆడకపొయ్యేసరికి అమర్ దీప్ కి ఏమైంది అసలు అని అనుకున్నారు. అదే రేంజ్ ఆట ని అమర్ దీప్ కొనసాగించి ఉండుంటే ఈపాటికి ఎలిమినేట్ అయ్యి చాలా రోజులు అయ్యుండేది.

కానీ ఆరవ వారం నుండి అమర్ దీప్ తన గేమ్ తీరుని మార్చుకుంటూ వచ్చాడు. తనలో ఉన్న నెగటివ్స్ ని పాజిటివ్స్ గా మార్చుకొని తన గ్రాఫ్ ని బాగా పెంచుకున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియా లో జరిగే ప్రతీ పోలింగ్ లోను అమర్ దీప్ టాప్ 3 స్థానాల్లో ఒక స్థానం ని ఆక్రమించేసుకున్నాడు. ఇక ఈ వారంతో అమర్ దీప్ గ్రాఫ్ టాప్ 1 రేంజ్ కి అడుగు దూరం లో ఉంది అని అంటున్నారు.

ఇప్పడు అమర్ దీప్ టాస్కులు బాగా ఆడడం తో పాటుగా,అద్భుతంగా ఎంటర్టైన్మెంట్ పంచడం లో కూడా సక్సెస్ అవుతున్నాడు. ఇక యావర్ అసూయ తో అమర్ దీప్ మీద విరుచుకుపడడం, నామినేషన్స్ లో అత్యంత సిల్లీ పాయింట్స్ ని తీసుకొని రావడం వంటివి అమర్ దీప్ కి జనాల్లో ఇంకా క్రేజ్ ని పెంచేలా చేస్తున్నాయి. అత్యంత నెగటివ్ గేమ్ నుండి, అత్యంత పాజిటివ్ గేమ్ ఆడేవైపుగా అమర్ దీప్ బిగ్ బాస్ ప్రయాణం ఇంతకీ ముందు ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రయాణం లో కూడా చూడలేదని విశ్లేషకులు చెప్తున్నారు.