Allu Sirish – Manchu Lakshmi : చాలా రోజుల నుండి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ అటు సినిమాలకు దూరంగా, ఇటు మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఆయన హీరో గా నటించిన చివరి చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. ఈ చిత్రం విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని అయితే తెచ్చుకుంది కానీ, కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఫలితంగా అల్లు శిరీష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఒకటిగా నిల్చింది.

ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఆయన ఏ సినిమాలో కనిపించలేదు. కొద్ది నెలల క్రితం బడ్డీ అనే చిత్రాన్ని ప్రకటించాడు కానీ, ఇప్పటి వరకు షూటింగ్ ప్రారంభం కాలేదు. ఇదంతా గమనించిన అభిమానులు అల్లు శిరీష్ సినిమాలు మానేసాడు ఏమో అని అనుకున్నారు. అంతే కాదు మిగిలిన మెగా హీరోలతో పోలిస్తే అల్లు శిరీష్ బయట కనిపించడం కూడా చాలా తక్కువ. ఇదంతా చూసి అభిమానులు అసలు అల్లు శిరీష్ ఏమయ్యాడు అనే సందేహం లో పడ్డారు.

అయితే చాలా రోజుల తర్వాత ఆయన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలో కనిపించాడు. ఇప్పుడు లేటెస్ట్ గా మంచు లక్ష్మీ ప్రసన్న తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ప్రైవేట్ పార్టీ ఫోటోలలో కనిపించాడు. ఒక ప్రైవేట్ పార్టీలో కలుసుకున్న వీళ్లిద్దరు రొమాంటిక్ మోడ్ లో ఉండడం చూసి అందరూ షాక్ కి గురి అయ్యారు. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలలో అల్లు శిరీష్ లక్ష్మీ ప్రసన్న బుగ్గని గట్టిగా ముద్దాడుతున్న ఫోటోని మనం గమనించొచ్చు.

పెళ్ళైన మంచు లక్ష్మి ఇలా పరాయి మగాడితో ముద్దు పెట్టించుకోవడం ఏమిటి అని ఈ ఫోటోని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే సినిమా కల్చర్ లో ఇవన్నీ సర్వసాధారణం అని, ఇవి బయట జనాలకు చాలా కొత్తగా అనిపించొచ్చు కానీ, ఇండస్ట్రీ లో చాలా కామన్ అని, దీనికి వేరే అర్థాలతో చూడాల్సిన అవసరం లేదంటూ మరికొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.