Bigg Boss Telugu లో నామినేషన్స్ పర్వం వచ్చిందంటే హౌస్ ఎంత హీట్ వాతావరణం లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వాదనలు ప్రతివాదనలు తారాస్థాయికి చేరుకొని కంటెస్టెంట్స్ కొట్టుకునే రేంజ్ కి తీసుకెళ్తుంది. ఈ సీజన్ మొత్తం అలాంటి సందర్భాలు హౌస్ లో చాలానే వచ్చాయి. గత సీజన్స్ లో నామినేషన్స్ కేవలం ఒక్క రోజు మాత్రమే ఉండేవి, కానీ ఈ సీజన్ లో మాత్రం సోమవారం తో పాటుగా మంగళవారం కూడా నామినేషన్స్ ప్రక్రియ కి సంబంధించిన ఫుటేజీ ని టెలికాస్ట్ చేస్తున్నారు.
ఇక వారం కూడా నామినేషన్స్ ప్రక్రియ చాలా హీట్ వాతావరణం మధ్య కొనసాగింది. ముఖ్యంగా రతికా మరియు అశ్వినీ చేసిన ఓవర్ యాక్షన్ పై సోషల్ మీడియా లో ట్రోలింగ్స్ ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. శివాజీ రతికా కి నామినేషన్స్ విషయం లో బలంగా ఉండమని సలహా ఇస్తే, రతికా రెచ్చిపోయింది.
అలా రెచ్చిపోవడం తో తనకి తానే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగా అయ్యింది. ఇక అశ్వినీ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఏమి లేకపోయినా కూడా ఓవర్ డ్రామా చెయ్యడం లో ఈమె దిట్ట. నిన్న కంటెస్టెంట్స్ ని నామినేట్ చేస్తూ నెత్తి మీద బాటిల్ ని పగలకొట్టాలి. ఈ ప్రక్రియ లో ప్రియాంక ని చెడుగా చూపించేందుకు అశ్వినీ మామూలు ప్లాన్ వెయ్యలేదు. ప్రియాంక నెత్తి మీద బాటిల్ తో కొట్టినప్పుడు , ఎందుకు అంత గట్టిగా కొడుతున్నావు, నిజంగానే నా మీద అంత కోపంగా ఉందా అంటూ డ్రామా చేసింది.
దీనిని అడ్డుపెట్టుకొని శివాజీ బ్యాచ్ సోషల్ మీడియా లో నానా హంగామా చేసింది. ప్రియాంక కొట్టిన దెబ్బకి అశ్వినీ తలకి గాయం అయ్యిందని, నెత్తురు కూడా వచ్చింది అంటూ ప్రచారం చేసారు. కానీ బిగ్ బాస్ ఇచ్చిన బాటిల్స్ నిజమైన బాటిల్స్ కావు, వీటిని క్యారమెల్ బాటిల్స్ అంటారు , అంటే షుగర్ తో చేసిన బాటిల్స్ అన్నమాట. వీటివల్ల ఎవరికీ ఎలాంటి నష్టం లేదు. అలాంటి బాటిల్స్ ని అడ్డుపెట్టుకొని ప్రియాంక కి చెడ్డపేరు తెచ్చేందుకు పెద్ద ప్రయత్నం చేసింది అశ్వినీ.