Tamannaah Bhatia : 18ఏళ్ల తర్వాత హిట్ కొట్టిన మిల్కీ బ్యూటీ తమన్నా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

- Advertisement -


Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రస్తుతం తెలియని వారుండరు. 2005లో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట హిందీ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన ముద్దుగుమ్మ.. ఏడాదిలోపే టాలీవుడ్ లోకి శ్రీ సినిమాతో అడుగుపెట్టింది. అయితే కెరీర్ స్టార్టింగ్ లో తాను టాలీవుడ్ లో నటించిన రెండు సినిమాలు సక్సెస్ అందుకోలేకపోయాయి. తర్వాత తమిళంలో ఆఫర్ దక్కించుకుని అక్కడ కూడా సక్సెస్ అందుకోలేదు. ఈ క్రమంలో 2007లో శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ సినిమాతో తమన్నాకు లక్కీ డేస్ ఎంట్రీ అయ్యాయి. ఆ సినిమా భారీ సక్సెస్ అందుకోవడంతో తమన్నాకు ఇండస్ట్రీలో తిరుగులేకుండా పోయింది. ఆ తర్వాత దాదాపు అందరు అగ్రహీరోల సరసన నటించి స్టార్ స్టేటస్ అందుకుంది.

Tamannaah Bhatia
Tamannaah Bhatia

ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న మిల్కీ బ్యూటీ ఇప్పటికి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 18 ఏళ్లు అవుతుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మరాఠి భాషల్లో నటించిన తమన్నా సౌత్ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది. అయితే తమన్నా కేవలం మలయాళంలో మాత్రమే నటించలేదు. దాదాపు తన సినీ కెరీర్ కూడా ముగింపుకొచ్చింది.

ఇక మలయాళ సినిమాలో తమన్నా ఎప్పటికీ నటించ లేదని చాలామంది భావిస్తున్నారు. అయితే తాజాగా దిలీప్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ మూవీ బాంద్రా సినిమాతో తమన్నాకు హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. 18 ఏళ్ల తర్వాత మ‌ళ‌యాళ మూవీ ఫస్ట్ ఛాన్స్ అందుకుంది తమన్నా. రిలీజ్ కు ఈ సినిమాపై పెద్ద అంచనాలు లేవు, కాకపోతే రిలీజ్ అయిన తర్వాత సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.

- Advertisement -
Tamannaah Bhatia Photos

గ‌త శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ ఓపెనింగ్స్ కూడా రాబట్టినట్లు బాక్స్ ఆఫీసు వర్గాల నుంచి సమాచారం. సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన 18 ఏళ్ల తర్వాత మిల్కీ బ్యూటీ మలయాళ సినీ ఇండస్ట్రీలో మొదటి హిట్ కొట్టింది. నటించిన ఒక్కగానొక్క సినిమానే మంచి సక్సెస్ అందుకోవడంతో తమన్నా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ప్రస్తుతం తమన్నా హిందీ తో పాటు అన్ని భాషల్లోనూ సక్సెస్ సాధించిన స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here