Shivaji : నటుడిగా, రాజకీయ నాయకుడిగా సాధించలేని అభిమానం బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా శివాజీ సాధించాడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. 2014 నుండి 2019 వరకు యాక్టీవ్ పాలిటిక్స్ లో కొనసాగిన శివాజీ, ఆ తర్వాత రాజకీయాలకు దూరమైపోయాడు. ఒకపక్క రాజకీయాలకు దూరమై, మరోపక్క సినిమాల్లో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న సమయం లో ఆయనకి ఒక వరం లాగ దక్కింది బిగ్ బాస్ రియాలిటీ షో.
ఈ షో ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకుల ప్రతీ ఇంట్లోకి వెళ్లినట్టు అయ్యింది. అయితే నిత్యం సోషల్ మీడియా లో ట్రెండ్ అయ్యే పేరు కాబట్టి, ఆయనకీ సంబంధించిన పాత వీడియోలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. వాటిల్లో ఆయన మాస్ మహారాజ రవితేజ గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘రవితేజ గారి నటించిన సినిమాల్లో నా మనసుకి బాగా దగ్గరైన చిత్రాలు కేవలం కొన్ని మాత్రమే ఉన్నాయి. వాటిల్లో ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ అనే చిత్రం కూడా ఒకటి. ఈ సినిమాలో ఆయన ఎంతో సహజంగా, ప్రేక్షకుల మనసుని హత్తుకునేలా నటించాడు. కానీ ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం రవితేజనే. ఆయనకీ ఉన్న మాస్ ఇమేజి కారణంగా ఆడియన్స్ ఈ చిత్రం లో రవితేజ రిసీవ్ చేసుకోలేకపోయారు.
అందుకే అలాంటి ఫలితం వచ్చింది’ అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ కామెంట్స్ ని రవితేజ ఫ్యాన్స్ చాలా పాజిటివ్ గా తీసుకున్నారు. శివాజీ గారు చెప్పిందే నిజమే, మాస్ ఇమేజి ఉన్నవారు ఇలాంటి చిత్రాల్లో నటించడానికి సాహసం చెయ్యరు. కానీ మా హీరో చేసాడు, ఆయనకీ ఇది ఒక మంచి ప్రయోగాత్మక చిత్రం అని చెప్పొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.