Bigg Boss Telugu : ఓవర్ యాక్షన్ కి పరాకాష్ట గా మారిన రతికా.. ఇంత నెగటివ్ మనిషి బిగ్ బాస్ హిస్టరీ లోనే లేదేమో!

- Advertisement -

Bigg Boss Telugu : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రతీ కంటెస్టెంట్ ఆట పరంగా తమకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన భోలే కూడా ఉన్న 5 వారాలు తన మార్కుని క్రియేట్ చేసుకొని వెళ్ళాడు. కానీ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి ఇప్పటి వరకు అసలు ఎలాంటి మార్కు క్రియేట్ చేసుకోలేకపోయిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది రతికా అనే చెప్పాలి.

Bigg Boss Telugu
Bigg Boss Telugu

ఈమె అసలు బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు ఎంటర్ అయ్యిందో, ఆమెకి కూడా క్లారిటీ లేదు. ఒకసారి ఆమె కన్నింగ్ ఆటని చూడలేక ప్రేక్షకులు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి నెట్టేశారు. కానీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరోసారి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈమె హౌస్ లోకి రావడం కంటెస్టెంట్స్ ఎవరికీ కూడా ఇష్టం లేదు. తక్కువ ఓటింగ్ వల్లే ఈమెని లోపలకు తోసారు బిగ్ బాస్ టీం.

Rathika

రెండవ సారి ఇంత పెద్ద రియాలిటీ షో లో రావడం అనేది ఒక అదృష్టం అనే చెప్పాలి. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అయినా తన ఆట తీరుని మార్చుకుంటుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ మొదట్లో ఉన్నదానికంటే వరస్ట్ గా తయారైంది ఇప్పుడు. గేమ్ అర్థం చేసుకోవడం రాదు, ఆడడం అసలుకే రాదు. మొదట్లో ప్రశాంత్ గేమ్ ని చెడగొట్టింది, ఇప్పుడు యావర్ గేమ్ ని పూర్తిగా చెడగొట్టేసింది. ఇక నిన్న జరిగిన నామినేషన్స్ లో అయితే ఈమె ఓవర్ యాక్షన్ చూడలేకపోయారు ఆడియన్స్. శివాజీ పర్ఫెక్ట్ పాయింట్స్ తో క్లారిటీ తో నామినేట్ చెయ్యమని ఆమెకి సూచనలు ఇచ్చాడు.

- Advertisement -
Bigg Boss Telugu Rathika

కానీ ఆమె మైండ్ లో నామినేషన్స్ కి ఒకరే ఉన్నారు అని చెప్పి, మరొకరిని నామినేట్ చెయ్యడానికి చాలా సమయం తీసుకుంది. శోభా కెప్టెన్సీ నచ్చలేదు అని నామినేట్ చేసింది, కానీ వీకెండ్ లో నా కెప్టెన్సీ బాగుంది అన్నావ్ కదా అని శోభా అడిగితే దానికి సమాధానం లేదు. ఇక ప్రియాంక పట్ల ఈమె వ్యవహరించిన తీరుని చూస్తే ఎవరికైనా కొట్టాలని అనిపిస్తాది. అసలు క్లారిటీ అనేదే లేకుండా నామినేషన్స్ వేసి తెగ ఓవర్ యాక్షన్ చేసింది. ఈ ఓవర్ యాక్షన్ లో పావు శాతం అయినా ఆమె ఈ వారం టాస్కులు ఆడడం లో పెడుతుందో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here