Vaishnavi Chaitanya : ఆ సినిమా చేసి కెరీర్ సర్వనాశనం చేసుకున్న ‘బేబీ’.. ప్రశంసలు వచ్చాయి.. కానీ అవకావాలే లేవు

- Advertisement -


Vaishnavi Chaitanya : ఇటీవల కాలంలో పలు రకాల యూట్యూబ్, షార్ట్ ఫిలిమ్స్ వీడియోలతో పాపులారిటీ దక్కించుకున్న వాళ్లు చాలామంది సినిమాల్లో అవకాశాలను అందుకుంటున్నారు. అలాగే బుల్లితెరపై సందడి చేసిన వాళ్లు కూడా వెండితెరపై వెలుగుతున్నారు. అలాంటి వారిలో ఒకరైన వైష్ణవి చైతన్య పేరు ప్రస్తుతం మార్మోగిపోతుంది. ఒక్క సినిమాతోనే తానో సెలబ్రిటీ రేంజ్ కు ఎదిగిపోయింది. యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వైష్ణవి చైతన్య.. ఆనంద్ దేవరకొండ తో కలిసి సాయి రాజేష్ దర్శకత్వంలో బేబీ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో అమ్మడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

Vaishnavi Chaitanya
Vaishnavi Chaitanya

ఈ సినిమా యూనిట్ కు పేరు ప్రఖ్యాతలు భారీగా వచ్చాయి. ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య పోషించిన బోల్డ్ క్యారెక్టర్ సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చింది. ఓ రకంగా ఈ క్యారెక్టర్ కారణంగానే సినిమా భారీ సక్సెస్ అందుకుంది. కానీ సినిమాతో వైష్ణవిని అభిమానించే వారి సంఖ్య కంటే ద్వేషించే వారి సంఖ్య భారీగా పెరిగిపోతుంది. సమాచారం ప్రకారం వైష్ణవి చైతన్య బేబీ సినిమాలో నటించి చాలా పెద్ద తప్పు చేశానని సన్నిహితుల దగ్గర వాపోయినట్లు తెలుస్తోంది. అనవసరంగా ఈ సినిమాని ఒప్పుకున్నాను.. షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్లలో చేసుకుంటూ ఉంటే మంచి అవకాశాలు వచ్చేవి. కానీ హీరోయిన్ గా వచ్చిన తర్వాత ప్రస్తుతం ఇటు హీరోయిన్ అవకాశాలు లేక.. అటు షార్ట్ ఫిలిమ్స్ చేయలేక ఖాళీగా ఉన్నానని తన స్నేహితులతో చెప్పుకుని బాధపడిందట.. మళ్లీ SKN ప్రొడక్షన్ హౌస్ లో తనకు మరో సినిమా చేసే అవకాశం ఇస్తారా లేదా అనే విషయంపై తనకు ఇంకా క్లారిటీ రాలేదట. కానీ డైరెక్టర్ సాయి రాజేష్, ఆనంద్ దేవరకొండ మాత్రం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. వైష్ణవి చైతన్య పరిస్థితే ప్రశ్నగా మిగిలిపోయింది.

vaishnavi
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here