Vijay Deverakonda – Rashmika : విజయ్ దేవరకొండ ఇంట్లో దీపావళి సంబరాలు చేసుకున్న రష్మిక.. వైరల్ అవుతున్న ఫోటోలు!

- Advertisement -

Vijay Deverakonda – Rashmika : గత కొద్ది సంవత్సరాల నుండి సోషల్ మీడియా లో ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ రష్మిక మధ్య ప్రేమ చిగురించింది అని, వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, ప్రస్తుతం రష్మిక విజయ్ దేవరకొండ ఫ్యామిలీ తో కలిసి హైదరాబాద్ లోనే ఉంటుందని ప్రచారం జరుగుతూనే ఉంది. ఇవి కేవలం రూమర్స్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, కాదు నిజమే అని నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు.

Vijay Deverakonda - Rashmika :
Vijay Deverakonda – Rashmika :

వీళ్లిద్దరు కూడా ఒకరికొకరు పరోక్షంగా అభిమానులకు హింట్స్ ఇస్తూనే ఉన్నారు కానీ, రిలేషన్ షిప్ గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ పెళ్లి చేసుకోబోతున్నారు అనేది మాత్రం అందరికీ అర్థం అయ్యింది. కలిసి వరల్డ్ టూర్స్ కి వెళ్లడం, విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక ఉన్నట్టుగా అనేకసార్లు ఆధారాలతో సహా దొరికిపోవడం వంటివి జరిగింది. ఇక నిన్న దీపావళి పండగ ని మన టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ ఎంతో ఉత్సాహం గా జరుపుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

Rashmika Mandanna VIjay deverakonda

అందరిలాగానే విజయ్ దేవరకొండ కూడా దీపావళి పండుగని ఘనంగా జరుపుకొని దానికి సంబంధించిన ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసాడు. ఆయన ఈ ఫోటోలను అప్లోడ్ చేసిన కాసేపటికి రష్మిక కూడా ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. ఇద్దరూ కలిసి అయితే ఫోటోలు దిగలేదు కానీ, వీళ్లిద్దరు ఒకే చోట ఉన్నట్టు మాత్రం అందరికీ అర్థం అయ్యింది.

- Advertisement -
Vijay deverakonda

ఎందుకంటే విజయ్ దేవరకొండ ఉన్న ఇల్లు, అలాగే రష్మిక ఉన్న ఇంటి ఫోటోలు రెండు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వడమే అందుకు కారణం. ఈ క్రింది ఫోటోలను గమనిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. ఇలా ఎన్ని రోజులు అని దాచిపెడుతారు, ఇన్ని సార్లు దొరికిపోయాక ఇక అధికారికంగా పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పేయొచ్చు కదా అని సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి వీళ్లిద్దరి పెళ్లి వార్త ఎప్పుడు అధికారికంగా బయటకి రాబోతుందో చూడాలి.

Rashmika Mandanna
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here