Shivaji : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి, ఇప్పటి వరకు శివాజీకి అమర్ దీప్ అంటే ఎందుకో ఇష్టం లేదు అనే విషయం అందరికీ తెలుస్తూనే ఉంది. ఎదో సరదాగా అలా అంటున్నాడులే అని కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు. కానీ నిజంగానే తనకి అమర్ దీప్ అంటే ఇష్టం లేదు అనే విషయాన్ని జనాలకు గుర్తు చేస్తూనే ఉన్నాడు శివాజీ. నిన్నటి ఎపిసోడ్ తో శివాజీ కి అమర్ మీద ఉన్న అక్కసు ఏంటో మరోసారి అందరికి తెలిసొచ్చింది.
నిన్న దీపావళి సందర్భంగా కంటెస్టెంట్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు వేదిక మీదకు వచ్చి కంటెస్టెంట్స్ తో సరదాగా కాసేపు మాట్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. శివాజీ చిన్న కొడుకు విక్కీ మరియు ఆయన భార్య కూడా వచ్చారు. కాసేపు శివాజీ తో మాట్లాడిన తర్వాత హౌస్ మేట్స్ తో కూడా వీళ్ళు మాట్లాడారు.
నాగార్జున మీ దృష్టిలో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అని అడగగా శివాజీ , ప్రశాంత్ , యావర్ , అమర్ దీప్ మరియు ప్రియాంక పేర్లు చెప్తారు. అమర్ దీప్ ని శివాజీ కొడుకు అమర్ అన్నా అని పిలవగానే అమర్ దీప్ ‘బ్రో’ అని పిలుస్తాడు. అది విన్న శివాజీ ‘ఎవర్రా నీకు బ్రో’ అని సీరియస్ గా అంటాడు. ఇక్కడ శివాజీ కి అమర్ దీప్ మీద ఉన్న అయిష్టం అందరికీ అర్థం అయ్యింది.
హౌస్ లో ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యుల దగ్గర కూడా అది చూపించడం కరెక్ట్ కాదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ శివాజీ మీద విరుచుకుపడుతున్నారు. ఇంత అయిష్టం శివాజీకి అమర్ మీద ఎందుకు కలిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు. మొదటి వారం నుండి మొన్నటి వారం వరకు ఎదో ఒక కారణం చేత అమర్ దీప్ ని నామినేట్ చేస్తూ వచ్చారు శివాజీ మరియు అతని బ్యాచ్. ఇక మిగిలిన 5 వారాలు కూడా అమర్ దీప్ పై నామినేషన్ శివాజీ మరియు అతని బ్యాచ్ వేస్తారు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదని అంటున్నారు నెటిజెన్స్.