Sai Pallavi : హీరోయిన్ సాయిపల్లవి ప్రస్తుతం ముంబయిలో ఉంది. దీంతో ఆ మూవీ కోసమే ఆమె అక్కడికి వెళ్లిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సాయి పల్లవి ముంబయిలో ఉన్నారంటూ తనతో దిగిన ఓ ఫొటోను అభిమాని షేర్ చేశారు. దీంతో త్వరలోనే రామాయణం సినిమా ప్రారంభం కానున్నట్లు ప్రచారం జోరందుకుంది. రామాయణం మూవీ కోసమే ముంబయికి మకాం మార్చినట్లు సమాచారం.

బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ రామాయణం ప్రాజెక్ట్ రూపొందించే పనిలో ఉన్నారు. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రధారులుగా మూవీ తీస్తున్నారం టాక్. దీంతో సాయిపల్లవి ఫొటో వైరల్ అవ్వడంతో మరోసారి రామాయణం మూవీ ట్రెండింగ్ లోకి వచ్చింది. మూవీ కోసమే సాయిపల్లవి ముంబయి వెళ్లినట్లు ఆమె అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

తెరకెక్కించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సాయి పల్లవికి సంబంధించిన ఓ ఫొటో ఎక్స్‌లో కనిపించింది. దీంతో ‘రామాయణం’ సినిమా మరోసారి వార్తల్లోకి వచ్చింది. మరోవైపు ఈ చిత్రం కోసం అభిమానులు క్రియేట్ చేసిన ఏఐ ఇమేజ్‌లు కూడా వైరల్‌గా మారాయి. ఇప్పటి వరకు ఈ మూవీలో నటించే యాక్టర్స్ గురించి అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ చేయలేదు. కాకపోతే రణ్ బీర్, సాయిపల్లవి, యశ్ ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.
ఇక రామాయణం మూవీ విషయానికి వస్తే.. దీన్ని రెండు భాగాలుగా తీసుకురావాలని భావిస్తున్నారు మేకర్స్. మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు మొదటి భాగం షూటింగ్ నిర్వహించనున్నారట. శ్రీలంకలో భారీ సెట్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అల్లు అరవింద్, మధు మంతెన నిర్మిస్తున్నారు.