Shivaji Raja : బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ ని జూనియర్ ఎన్టీఆర్ ఇంతలా అవమానించాడా..? ముట్టుకోడానికి కూడా ఇష్టపడలేదా!

- Advertisement -

Shivaji Raja : సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా శివాజీ ప్రతీ ఒక్కరికి పరిచయమే. కానీ ఇన్నేళ్ల కెరీర్ లో ఆయన ఎంత మంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నాడు అంటే శివాజీ కూడా సమాధానం చెప్పలేడు. కానీ బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఎంత ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు అని అడిగితె మాత్రం శివాజీ గర్వంగా చెప్పుకోగలడు. ఈ రియాలిటీ షో ద్వారా ఆయన అంత అభిమానం సంపాదించుకున్నాడు.

Shivaji Raja
Shivaji Raja

ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ లో అత్యధిక ఆదరణ దక్కించుకొని టాప్ 1 కంటెస్టెంట్ గా నిలిచి టైటిల్ గెలుచుకునే అవకాశాలు శివాజీ కి ఎక్కువగా ఉన్నాయి. ఆయనకీ వచ్చేంత ఓటింగ్ శాతం, మిగిలిన కంటెస్టెంట్స్ అందరికంటే మూడు రెట్లు ఎక్కువ ఉంటుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలా ఈ షో ద్వారా అంతటి ఆదరణ దక్కించుకున్న శివాజీ కి ఒకసారి ఘోరమైన అవమానం జరిగిందట.

Shivaji Raja Bigg Boss Telugu

ఆయన్ని అలా అవమానించింది ఎవరో కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారే. గతం లో ఆయన ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయాన్నీ స్వయంగా చెప్పుకొచ్చాడు. ‘జూనియర్ ఎన్టీఆర్ గారి తండ్రి చనిపోయినప్పుడు నేను ఆయన్ని పరామర్శించడానికి ఇంటికి వెళ్ళాను. ఆయన్ని కౌగలించుకోడానికి దగ్గరకి వెళ్తే, ఆయన నా రెండు చేతులను పక్కకి నెట్టేశాడు. అప్పుడే అర్థం అయ్యింది, వీళ్ళని ముట్టుకోవాలంటే ఒక స్థాయి ఉండాలేమో అని’ అంటూ శివాజీ చాలా ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

- Advertisement -

ఇప్పుడు ఆయన బిగ్ బాస్ లో ఉన్నాడు కాబట్టి, ఆయన పేరు సోషల్ మీడియా లో తరచూ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు కూడా సోషల్ మీడియా లో ట్రెండ్ అవ్వడం సహజం. అలా ఈ వీడియో కూడా ట్రెండ్ అయ్యింది. దీనిపై సోషల్ మీడియా లో పలు భిన్నమైన అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here