Tiger 3 : నేడు సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘టైగర్ 3 ‘ గ్రాండ్ గా విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రావేమో అని ట్రేడ్ బయపడింది, కానీ టాక్ బాగా రావడం తో ఇండియా నుండి ఓవర్సీస్ వరకు కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం.
ఓవర్సీస్ షోస్ నుండి కాస్త యావరేజి టాక్ వచ్చినప్పటికీ, ఇండియా లో షోస్ ప్రారంభం అయిన తర్వాత టాక్ బాగా ఇంప్రూవ్ అయ్యింది. ఇదే టాక్ కొనసాగితే ఫుల్ రన్ లో ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిలు కొల్లగొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ట్రేడ్ పండితులు చెప్పేది ఏంటంటే దీపావళి రోజు కంటే కూడా, ఆ పక్క రోజు వచ్చే వసూళ్లు భారీ గా ఉంటాయని.
అంటే ఈరోజు కంటే రేపే ఎక్కువ వసూళ్లు వస్తాయి అన్నమాట. ఇకపోతే ఈ చిత్రం లో షారుఖ్ ఖాన్ మరియు హ్రితిక్ రోషన్ అతిధి పాత్రల్లో కనిపించారు. షారుఖ్ ఖాన్ ఇందులో పఠాన్ గా కనిపించగా, హృతిక్ రోషన్ కబీర్ గా ఎండ్ టైటిల్ కార్డ్స్ పడేటప్పుడు ఎంట్రీ ఇస్తాడు. ఇదంతా పక్కన పెడితే ‘వార్ 2 ‘ చిత్రం లో జూనియర్ ఎన్టీఆర్ నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే.
సీఐడీ ఆఫీసర్ టైగర్ 3 క్లైమాక్స్ లో కబీర్(హృతిక్ రోషన్) కి ఫోన్ చేసి ‘ఇండియా కి కొత్త శత్రువు నుండి ముప్పు ఉంది. అతను మరణం కంటే భయంకరమైన మనిషి. అత్యంత క్రూరుడు అయిన అతనితో పోరాడి పోరాడి నువ్వు కూడా సైతాన్ లాగ మారిపోవచ్చు, అతనితో యుద్దానికి సిద్ధం అవ్వు’ అని అంటాడు. టైగర్ 3 లో ఎన్టీఆర్ రిఫరెన్స్ ఉంటుంది అని గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో ప్రచారం అవుతూ వచ్చింది. ఆ రిఫరెన్స్ ఇదే.