Actor Arya : కోలీవుడ్ హీరో ఆర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పేరుకు తమిళ్ హీరో అయినా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. రాజా రాణి సినిమాతో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ఆర్య. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన వరుడు చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి తన మార్క్ విలనిజం చూపించారు. ఆ తర్వాత కూడా పలు సినిమాలలో నటించి మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. తాజాగా ఆయన మరో వెబ్ సిరీస్ తో ఓటీటి లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో దివ్య పిలై.. ఆజీయా ఆడుకోలం నరేశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ వెబ్ సిరీస్ కి మిళింద రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో హర్రర్ థ్రిల్లర్ గా చాలా గ్రాండ్ గా రూపొందిస్తూ ఉన్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈనెల 24న స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు చిత్ర మేకర్స్.. ది విలేజ్ అనే గ్రాఫిక్స్ నవల కథ ఆధారంగా ఈ హర్రర్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకరోజు రాత్రి తప్పు పోయిన కుటుంబాన్ని తిరిగి పొందేందుకు ఒక సామాన్య వ్యక్తి ఎలా కష్టపడ్డాడన్న కథాంశంతో ఈ సిరిస్ తెరకెక్కనుంది. ఆ సమయంలో తను ఎంత కష్టపడ్డాడు. తన కష్టాలకు కారణం ఏంటి. చివరకు తన కుటుంబం ఏమైంది. హీరో వారిని కలుస్తాడా లేదా అన్న కోణంలో కథ నడుస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ వైరల్ గా మారుతోంది. ఈ వెబ్ సిరీస్ చూస్తుంటే చాలా భయంకరంగా వెన్నులో వణుకు పుట్టించే సీన్లు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. హర్రర్ థ్రిల్లర్స్ అంటే ఇష్టపడేవాళ్లకు ఇది మంచి విందు భోజనంగా చెప్పుకోవచ్చు.