Japan Review : చాలా కాలం తర్వాత వచ్చిన పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్!

- Advertisement -

Japan Review : ఈమధ్య కాలం లో తమిళ సినిమాలు మన తెలుగు దబ్ అయ్యి తెగ ఆడేస్తున్నాయి. ఈ ఏడాది తమిళం నుండి తెలుగులోకి దబ్ అయినా జైలర్, మార్క్ ఆంటోనీ , వారసుడు మరియు లియో చిత్రాలు భారీ హిట్స్ గా నిల్చి బయ్యర్స్ కి లాభాల వర్షం కురిపించాయి . దీంతో తమిళ మూవీస్ కి మన దగ్గర మళ్ళీ క్రేజ్ పెరగడం మొదలైంది. అలా టీజర్, ట్రైలర్ దగ్గర నుండే యూత్ ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించిన లేటెస్ట్ చిత్రం ‘జపాన్’.

‘సర్దార్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హీరో కార్తీ చేసిన చిత్రం ఇది. కార్తీ కి తెలుగు లో అద్భుతమైన మార్కెట్ ఉంది. కొంతమంది మీడియం రేంజ్ తెలుగు హీరోలకంటే కార్తీ సినిమాలకు ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ కూడా జపాన్ మూవీ పై అంచనాలు పెరగడానికి కారణం అయ్యింది. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో ఒకసారి చూద్దాం.

- Advertisement -
Japan Review
Japan Review

కథ :

చిన్నతనం నుండి పేదరికం లో పెరిగిన జపాన్ (కార్తీ) అనే కుర్రాడు ఏ పని చెయ్యాలో తెలియక పొట్టకూటి కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పెరుగుతాడు. అలా క్రిమినల్ వరల్డ్ లోకి అడుగుపెట్టిన జపాన్ కి ఒక్క పెద్ద డీల్ వస్తుంది. మంత్రి ఇంట్లో డబ్బులు దొంగతనం చెయ్యాలి అనేది ఆ డీల్. మంచిగా ప్లానింగ్ చేసుకొని మంత్రి ఇంట్లో దొంగతనం చేస్తాడు జపాన్. సరిగ్గా అదే రోజు మంత్రి ఇంట్లో ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ కేసు జపాన్ మెడకి చుట్టుకుంటుంది. దీనివల్ల జపాన్ ఎన్నో సమస్యలను ఎదురుకుంటాడు. ఇంతకీ ఆ మర్డర్ చేసింది ఎవరు?, జపాన్ తెలివిగా ఈ మర్డర్ కేసు నుండి ఎలా తప్పించుకున్నాడు అనేది మిగతా స్టోరీ.

విశ్లేషణ :

ముందుగా హీరో కార్తీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది ఆయనకీ 25 వ సినిమా. ఇంత సుదీర్ఘ సినీ కెరీర్ లో కార్తీ ఎన్నో వైవిద్యభరితమైన పాత్రలు పోషించాడు. ఈ సినిమా లో కూడా ఆయన అలాంటి పాత్రనే పోషించాడు. గెటప్ దగ్గర నుండి డైలాగ్ డెలివరీ వరకు ప్రతీ ఒక్కటి ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించే ప్రయత్నం చేసాడు. ఆ ప్రయత్నం లో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు. ఈ చిత్రం లో అనేక సన్నివేశాల్లో కార్తీ కామెడీ టైమింగ్ ప్రేక్షకుల చేత కడుపుబ్బా నవ్వించేలా చేస్తుంది. ఇక సినిమా విషయానికి వస్తే ఇలాంటి రాబరీ జానర్ సినిమాలను ప్రేక్షకులు ఆద్యంతం ఉత్కంఠ తో తర్వాత ఏమి జరగబోతుంది అనే సస్పెన్స్ మరియు ట్విస్టులతో స్క్రీన్ ప్లే నడిపించాలి. అప్పుడే బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తుంది. డైరెక్టర్ రాజా మురుగన్ అలాగే ఈ స్క్రిప్ట్ ని డిజైన్ చేసాడు. చాలా సన్నివేశాలు అదిరిపోయాయి.

ముఖ్యంగా రాబరీ సీన్స్ కి థియేటర్స్ లో అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. కొన్ని సన్నివేశాల్లో హ్యూమర్ కూడా బాగా పేలింది. ముఖ్యంగా రాజా మురుగన్ కార్తీ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా, చాలా డిఫెరెంట్ గా ఈ పాత్రని డిజైన్ చేసి వినోదం అని అందించాడు. ఇక ఈ చిత్రం లో ఉన్న మైనస్ పాయింట్స్ ఏమిటంటే కథ రొటీన్ గా అనిపించడమే. పాటలు ఒక్కటి కూడా వినసొంపుగా లేదు. ఆన్ స్క్రీన్ మీద తన స్వాగ్ తో పాటలను లేపే ప్రయత్నం కార్తీ చేసాడు కానీ, మంచి సంగీతం తోడు అయ్యుంటే వేరే లెవెల్ ఉండేవి. కానీ ప్రధాన సన్నివేశాల్లో జీవీ ప్రకాష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఈ చిత్రానికి ప్లస్ అయ్యింది. సెకండ్ హాఫ్ లో ల్యాగ్ లు కూడా బాగా ఎక్కువయ్యాయి.

చివరి మాట :

ఓవరాల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ మరియు యూత్ ఆడియన్స్ కి ఈ వీకెండ్ మంచి టైం పాస్ అయ్యే సినిమా ఇది. వేరే ఆలోచనలు పెట్టుకోకుండా టికెట్స్ బుక్స్ బుక్ చేసేయండి.

నటీనటులు : కార్తీ, అను ఇమ్మానుయేల్ , సునీల్, విజయ్ మిల్టన్ , ఆష్నా సుధీర్ తదితరులు

రచన – దర్శకత్వం : రాజా మురుగన్
సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్
నిర్మాత : SR ప్రభు
బ్యానర్ : డ్రీం వారియర్ పిక్చర్స్, అన్నపూర్ణ స్టూడియోస్

రేటింగ్ : 2.75/5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here