Anushka Sharma : చెప్పకుంటే ఆగుతుందా.. బేబీ బంప్ తో అనుష్క.. మరోసారి తండ్రి కాబోతున్న విరాట్..!

- Advertisement -

Anushka Sharma : టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్, బీ టౌన్ బ్యూటీ అనుష్క శర్మ మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారా? ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఈ సెలబ్రెటీ పెయిర్ మరో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు వార్తలు వచ్చాయి. వాళ్లిద్దరే రెండో బిడ్డ గురించి రివీల్ చేస్తారని ఫ్యాన్స్ ఎదురు చూశారు. కానీ అఫీషియల్ గా ఈ విషయంపై ఎక్కడా ప్రకటించలేదు.

Anushka Sharma
Anushka Sharma

రీసెంట్ గా అనుష్క తన భర్త విరాట్‌తో కలిసి ఒక హోటల్ లోకి నడుస్తున్న వీడియో వైరల్ గా మారింది. అనుష్క తన బేబీ బంప్ ని దాచేలా చేతులు పెట్టి నడుస్తన్నట్లు ఆ వీడియోలో కన్పించింది. అందులో అనుష్క ప్రెగ్నెంట్ అయినట్లు చాలా క్లియర్ గా కన్పిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను విరుష్క ఫ్యాన్స్ షేర్ చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. అనుష్క శర్మ రెండోసారి ప్రెగ్నెంట్ అని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం ఈ జంట ముంబైలోని ఓ గైనక్ క్లినిక్‌కు వెళ్లారు. ఎందుకు వచ్చామనే విషయంపై త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పి ఫొటోలు తీయొద్దని కోహ్లి మీడియాను అభ్యర్థించారు.

ప్రస్తుతం అనుష్క బేబీ బంప్ క్లియర్ గా కన్పించడంతో ఆమె ప్రెగ్నంట్ అని తెలుస్తోంది. దీంతో విరాట్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఛోటా విరాట్ వస్తున్నాడని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీనిపై విరుష్క జంట స్పందిస్తేనే అసలు విషయంలో ఏంటో క్లియర్ గా తెలుస్తోంది. విరుష్కకు 2021లో వామిక అనే కూతురు జన్మించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం జరుగుతన్న వరల్డ్ కప్ లో విరాట్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్స్ చేస్తున్నాడు. ఈ వరల్డ్ కప్ పూర్తి అయ్యాక విరాట్- అనుష్క జంట ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించే ఛాన్స్ ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here