Payal Rajput : గ్లామర్ కి కేరాఫ్ అడ్రెస్ పాయల్ రాజ్ పూత్. ఆర్డీఎక్స్ మూవీతో అందర్నీ తనవైపు చూసేలా చేసింది ఈ బ్యూటీ. రీసెంట్ గా బోల్డ్ ఫొటో షూట్ తో కుర్రాళ్ల హృదయాలు కొల్లగొట్టింది. షార్ట్ డ్రెస్ లో థైస్ చూపిస్తూ యువత గుండెలు ఐస్ అయ్యేలా చేసింది. సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
సీరియల్ యాక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన పాయల్ కు ఆర్ ఎక్స్ మూవీతో బిగ్ బ్రేక్ వచ్చింది. ఆర్ ఎక్స్ 100 బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం నమోదు చేసింది. ఈ మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ రోల్ చేసింది. పాయల్ గ్లామర్ కు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. తర్వాత వరుసపెట్టి మూవీ ఆఫర్లు వచ్చాయి.
ఆర్ఎక్స్ 100 రేంజ్ హిట్ పాయల్ కు మళ్లీ పడలేదు. దీంతో ఆమె కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఆర్డీఎక్స్ లవ్ పేరుతో మరో బోల్డ్ మూవీ చేసింది. కానీ అది డిజాస్టర్ అయ్యింది. దర్శకుడు బాబీ తెరకెక్కించిన వెంకీ మామ చిత్రంలో పాయల్ వెంకీకి జంటగా నటించింది. నాగ చైతన్య-రాశి ఖన్నా మరో జంటగా నటించింది. వెంకీమామ మూవీ చేయకుండా ఉండాల్సిందని ఓ ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ
ప్రస్తుతం పాయల్ ఆశలన్నీ మంగళవారం మూవీ మీదే. ఈ మూవీ కోసం ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతితో మరోసారి జతకట్టింది. ఈ మూవీలో కూడా బోల్డ్ గా నటిస్తున్నట్లు ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది. పాయల్ లీడ్ రోల్ చేస్తున్న మంగళవారం మూవీ నవంబర్ 17న విడుదల కానుంది. మిస్టీరియస్ అండ్ సస్పెన్సు హారర్ విలేజ్ డ్రామాగా మంగళవారం తెరకెక్కింది. పాయల్ పాత్ర ఆసక్తి రేపుతోంది. మంగళవారం మూవీతో పాయల్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఆమె ఫ్యాన్స్.