Director Venky Kudumula : నాగశౌర్య హీరోగా నటించిన ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు వెంకీ కుడుముల. ఇటీవల ఆయన ఇంట్లో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి. తన కజిన్ అనారోగ్యంతో చనిపోయినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్లో పోస్ట్ షేర్ చేయడం జరిగింది. కోవిడ్ తర్వాత వచ్చే జ్వరాన్ని ఎవరూ అసలు నార్మల్ గా తీసుకోవద్దని.. అలా ఆ సాధారణ జ్వరమే అనుకోని నిర్లక్ష్యం చేసి తన కజిన్ ను దూరం చేసుకున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు.
నా కజిన్ కి రెండు వారాలుగా జ్వరం వచ్చింది. కానీ అది కేవలం సాధారణ జర్వంగానే భావించి డాక్టర్ వద్దకు తీసుకొని వెళ్లకుండా నిర్లక్ష్యం చేశాం. కానీ ఆ జ్వరం జీబీ సిండ్రోమ్ అని పిలవబడే ఒక అరుదైన వ్యాధిగా వైద్యులు గుర్తించారు. మనిషిలో రోగ నిరోధక శక్తి అదుపుతప్పి అది నరాల పై చాలా ఒత్తికి గురయ్యేలా చేస్తుందట. ఈ వ్యాధి తర్వాత మనిషి శరీరంలో చాలా మార్పులు వస్తాయట. ఇది మొదట్లోనే దానిని గుర్తించి సమయానికి చికిత్స తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెప్పారు.
కానీ మేము నిర్లక్ష్యం చేయడం వల్లనే అతని జీవితం కోల్పోయాడు. దీంతో కుటుంబం తీరని విషాదానికి గురికావాల్సి వచ్చింది. కోవిడ్ తర్వాత వచ్చిన ఏ జ్వరం అయినా సరే లైట్ గా తీసుకోకూడదు. మన శరీరం సరైన స్థితిలో లేనప్పుడు.. అది జ్వరం అనారోగ్యం లేకపోయినా పలు రకాల అసౌకర్యాలను కలిగిస్తూ హెచ్చరిస్తుందట. దయచేసి ఇలాంటి సమయాలలో ప్రతి ఒక్కరు కూడా వైద్యుని వద్దకు వెళ్లి చెక్ అప్ చేయించుకోవాలి అంటూ ట్విట్టర్లో తెలియజేశారు డైరెక్టర్ వెంకీ కుడుముల. ఆరోగ్యం వైపు ఒక చిన్న తప్పటడుగు వేస్తే కుటుంబాన్ని జీవితాలను కోలుకోలేనటువంటి నష్టం నుంచి కాపాడుతుందంటూ తెలిపారు.