Lavanya Tripathi : టాలీవుడ్ లో క్యూట్ ప్రేమ జంట గా పేరు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ , ఈ నెల 1 వ తారీఖున ఇటలీ లో బంధు మిత్రుల సమక్షం లో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సుమారుగా ఆరేళ్ళ నుండి ప్రేమించుకుంటున్న ఈ జంట, డేటింగ్ కూడా చేసింది. వరుణ్ తేజ్ ఇంట్లో గత రెండు సంవత్సరాల నుండి నివసిస్తూ వచ్చింది లావణ్య త్రిపాఠి.
కుటుంబం లోని ప్రతీ కార్యక్రమం మరియు ప్రతీ విషయం లో పాలుపంచుకుంటూ ఒక కుటుంబ సభ్యురాలిగా పెళ్ళికి ముందే కలిసిపోయింది. గతం లో మెగా ఫ్యామిలీ లో జరిగిన ఎన్నో ప్రైవేట్ ఫంక్షన్స్ లో లావణ్య త్రిపాఠి కనిపించడం మనమంతా చూస్తూనే ఉన్నాం. అయితే ఈ రెండేళ్ళలో కలిసి ఉన్నప్పుడు రాని సమస్య మొన్న పెళ్లి లో వరుణ్ తేజ్ తల్లి పద్మజ మరియు లావణ్య త్రిపాఠి మధ్య వచ్చిందట.
అసలు విషయానికి వస్తే లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ రిసెప్షన్ కోసం వరుణ్ తేజ్ తల్లి పద్మజ గారు ప్రత్యేకంగా ఒక లెహంగా అని తయారు చేయించి తీసుకొచ్చింది అట. కానీ ఎందుకో ఆ లెహంగా లావణ్య త్రిపాఠి కి నచ్చలేదు. చాలా అసౌకర్యంగా ఫీల్ అయ్యిందట. దీంతో అత్తయ్య పద్మజ తెచ్చిన లెహంగా ని పక్కన పెట్టి, తనకి నచ్చిన డ్రెస్ ని తొడుక్కుందట.
దీనికి పద్మజ గారు బాగా హర్ట్ అయ్యారట. ఏమిటి ఇలా చేసావు అని లావణ్య ని అడగగా, అది చాలా అసౌకర్యంగా ఉంది, అందుకే ఇది వేసుకున్నాను అని చెప్పిందట. ఇద్దరి మధ్య కాసేపు వాదనలు కూడా నడిచాయట. వరుణ్ తేజ్ కూడా లావణ్య త్రిపాఠి కి సపోర్ట్ గా మాట్లాడడం తో పద్మజ గారు ఇక చేసేది ఏమి లేక సైలెంట్ అయిపోయిందట. ఇలా అత్తా కోడళ్ల మధ్య ఏర్పడిన ఈ చిన్న మనస్పర్ధ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.