Bigg Boss Telugu 7 లో కంటెస్టెంట్ శివాజీ ఆడిందే ఆట , పాడిందే పాట అన్నట్టుగా తయారైంది. న్యాయం చెప్పాల్సిన హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా శివాజీ భజన చెయ్యడం, అతని పై జనాల్లో ఉన్న అభిప్రాయం మార్చే ప్రయత్నాలు చెయ్యడం గడిచిన కొద్దివారాల నుండి మనం చూస్తూనే ఉన్నాం. బాల్స్ దొంగతనం చేసే విషయం లో శివాజీ తేజా మరియు గౌతమ్ తో చర్చలు అప్పట్లో చాలా వాడివేడిగా చేసారు.
టాస్కులో భాగంగా దొంగతనాలు చెయ్యడం తప్పు కాదని తేజా మరియు గౌతమ్ వాదిస్తే, శివాజీ చాలా కోపం తో నీతిగా టాస్కులు ఆడకపోతే అది కూడా ఒక బ్రతుకేనా, బిగ్ బాస్ హౌస్ లోకి దొంగతనాలు చెయ్యడానికి వచ్చారా అని రెచ్చిపోయాడు. ఆ తర్వాత గౌతమ్ ని నువ్వు డాక్టర్ వి అయ్యుండి నీతి, నియమాలు మర్చిపోతున్నావ్, క్యారక్టర్ ని మైంటైన్ చెయ్ అని అనరాని మాటలు అనేశాడు.
కానీ నాగార్జున మాత్రం అదంతా శివాజీ స్ట్రాటజీ, అతని ఆపితే ఆగిపోతారా అని కవర్ చెయ్యడానికి వచేసాడు. అది స్ట్రాటజీ అని శివాజీ కి కూడా తెలీదు పాపం, నాగార్జున కవరింగ్ ఆ రేంజ్ లో ఉన్నింది మరి. అయితే అది స్ట్రాటజీ అయ్యినప్పుడు గౌతమ్ వృత్తిని ప్రస్తావిస్తూ శివాజీ కామెంట్ చెయ్యడం కరెక్ట్ కాదు. ఆ విషయంపైనే గౌతమ్ శివాజీ ని నామినేట్ చేసాడు. అది కూడా కాకుండా మరో రెండు కారణాలు చెప్పి కూడా నామినేట్ చేసాడు. శివాజీ మీద గౌతమ్ చెప్పిన పాయింట్స్ సరైనవి అనిపించాయి కాబట్టి రాజమాతలు శివాజీ ని నామినేట్ చేసారు.
దీనికి శివాజీ కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. కాసేపు పిచ్చి పట్టిన వాడిలాగా వ్యవహరించాడు. ‘రాజమాతలు’ మీకు పగిలిపోతాది అంటూ కొనసాగింపుగా ఎదో బూతు మాట అంటాడు. ఆ బూతు మాటకి స్టార్ మా టీం బీప్ సౌండ్ పెట్టింది. అంతే కాకుండా రాత్రి సమయం లో ప్రియాంక మాటలు గట్టిగా వినపడడం తో శివాజీ ‘అది చూడు ఎలా ఆర్తుస్తుందో, ఎత్తి **** ‘ అంటూ మరోసారి ఎదో బూతు మాట మాట్లాడాడు. మరి దీనిపై ఈ వీకెండ్ లో నాగార్జున శివాజీ ని మందలిస్తాడో, లేకపోతే ఎప్పటిలాగానే భజన చేస్తాడో చూడాలి.