Shivaji Raja : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా చిన్న చిన్న పాత్రల ద్వారా పాపులారిటీ ని సంపాదించుకొని, ఆ తర్వాత హీరో గా మారి సుమారుగా 90 సినిమాల్లో నటించిన నటుడిగా, కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన వ్యక్తిగా శివాజీ కి ఒక ఇమేజి ఉంది. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా తన మార్కుని చూపించాడు.
రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ అందరికంటే అత్యధిక ఓట్లతో టాప్ 1 స్థానం లో కొనసాగుతున్నాడు. నీతి నిజాయితీ గల వ్యక్తిగా శివాజీ ఈ రియాలిటీ షో ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఇదే రేంజ్ గ్రాఫ్ ని మైంటైన్ చేస్తూ పోతే కచ్చితంగా ఆయన టైటిల్ గెలిచి, కప్ కొట్టి, 50 లక్షల రూపాయిల ప్రైజ్ మనీ ని కూడా సొంతం చేసుకుంటాడని అంటున్నారు.
ఇదంతా పక్కన పెడితే శివాజీ తన వ్యక్తిగత విషయాలను పంచుకోడానికి అసలు ఇష్టపడడు. ఇప్పటి వరకు ఆయన తన భార్య పిల్లల ఫోటోలను బయటకి లీక్ కాకుండా చూడడమే అందుకు నిదర్శనం. కానీ మాకు తెలిసిన కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా శివాజీ భార్య పిల్లల గురించి మీకెవ్వరికీ తెలియని కొన్ని విషయాలను తెలియచెయ్యబోతున్నాము. శివాజీ గారి భార్య పేరు శ్వేతా గౌడ్. ఈమె తెలంగాణ ప్రాంతం లోని నిజామాబాద్ కి చెందిన అమ్మాయి.
ఈమె MLC వీజీ గౌడ్ తోడల్లుడు కూతురు అట. గొప్ప రాజకీయ నేపథ్యం ఉన్న అమ్మాయి అయినప్పటికీ కూడా, ఒక్క రూపాయి కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడట శివాజీ. ఈమె శివాజీ తో పెళ్లి కాకముందు సినిమాల్లో హీరొయిన్ గా నటించాలని కోరుకుంది కానీ, ఆ సమయం లోనే శివాజీ పరిచయం అవ్వడం, ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వంటివి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత శివాజీ తన భార్య ని షూటింగ్ కి కూడా తీసుకొని పోలేదట ఇప్పటివరకు.
సినిమాలకు అంత దూరంగా ఉంచాడు తన కుటుంబం మొత్తాన్ని. ఈ దంపతులిద్దరికీ ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు ‘శ్రీ’ రీసెంట్ గానే బీటెక్ పూర్తి చేసి ఈ ఏడాది లో ఎంఎస్ చదువుకోడానికి వెళ్తున్నాడు. ఇక చిన్న కొడుకు వెంకట్ ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ వారం కంటెస్టెంట్స్ కి సంబంధించిన కుటుంబాలు హౌస్ లోకి ఎంటర్ అవుతారు కాబట్టి, శివాజీ భార్య పిల్లల్ని చూసే అవకాశం ఉంటుంది.