Renu Desai : పవన్ కళ్యాణ్ మాజీ భార్య గా రేణు దేశాయ్ కి ఎంత మంచి పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా లో తరచూ యాక్టీవ్ గా ఉండే రేణు దేశాయ్ తనకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. బద్రి సినిమాతో వెండితెర కి పరిచయమైనా రేణు దేశాయ్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని పెళ్లాడాక ‘జానీ’ చిత్రం లో మాత్రమే నటించింది.
ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆమె వెండితెర పై కనిపించలేదు. రీసెంట్ గా దసరా కానుకగా విడుదలైన మాస్ మహారాజ రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం ద్వారా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లను సొంతం చేసుకుంది. రేణు దేశాయ్ పాత్రకి కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మీదట కూడా ఆమె ఇలాంటి పాత్రల్లో నటించే అవకాశం వస్తే చేస్తాను అని అంటుంది.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా అనేక మంది హీరోయిన్లు వింత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్టుగానే రేణు దేశాయ్ కూడా ఒక విచిత్రమైన వ్యాధితో బాధపడుతూ ఉందట. ఆమె మాట్లాడుతూ ‘నాకు గుండె సంబంధిత వ్యాధి ఉంది. ఈ విషయం నాకు తెలిసేది కాదు. ఒకసారి అస్వస్థత వస్తే హాస్పిటల్ లో స్కానింగ్ తీసుకున్న తర్వాత తెలిసింది.
ఇది నాకు పుట్టుక తో వచ్చిన సమస్య. ఇలాంటి సమస్యే మా నాన్నమ్మ కి కూడా ఉండేది, ఆమె 47 వయస్సులోనే చనిపోయింది. మా నాన్న కూడా ఇదే సమస్య తో బాధపడి చిన్న వయస్సులోనే చనిపోయాడు. ప్రస్తుతానికి నేను దీనికి మెరుగైన వైద్యం తీసుకుంటూ మందులు వాడుతున్నాను. ఎప్పుడు చనిపోతానో నాకు కూడా తెలియదు’ అంటూ ఎమోషనల్ గా ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ క్రింద అభిమానులు రేణు దేశాయ్ కి ధైర్యం చెప్తూ పాజిటివిటీ ని నింపే ప్రయత్నం చేసారు.