Amala Paul : ఘనంగా జరిగిన హీరోయిన్ అమల పాల్ రెండవ పెళ్లి..పెళ్లి కొడుకు బ్యాక్ గ్రౌండ్ చూస్తే మెంటలెక్కిపోతారు!

- Advertisement -

Amala Paul : చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లో ఒకరు అమలాపాల్. ఈమె ఎక్కువగా తమిళం మరియు మలయాళం లో సినిమాలు చేసింది. తెలుగు లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ‘నాయక్’, అల్లు అర్జున్ తో ‘ఇద్దరమ్మాయిలతో’ మరియు నాగ చైతన్య తో ‘బెజవాడ’ అనే సినిమాలు చేసింది. వీటిల్లో నాయక్ అనే చిత్రం తప్ప మిగిలిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.

Amala Paul
Amala Paul

అయినప్పటికీ కూడా ఈమెకి టాలీవుడ్ ఆడియన్స్ లో మంచి గుర్తింపు ఉంది. ప్రతీ విషయం లో ముక్కు సూటితనం తో వెళ్లే అమలాపాల్ అంటే ఆడియన్స్ కి చాలా ఇష్టం. సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ తన జీవితం లో చోటు చేసుకున్న సంఘటనల గురించి చెప్పుకునే అమల పాల్ రీసెంట్ గా తాను రెండవ పెళ్లి చేసుకున్న విషయం గురించి ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో చెప్పుకొచ్చింది.

Amala Paul Marriage

ముందుగా ఆమె 2014 వ సంవత్సరం లో విజయ్ అనే మలయాళీ దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొనేళ్లు అతనితో సజావుగా కాపురం చేసిన అమల పాల్ కొన్ని అనుకోని సంఘటనల కారణంగా విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొంతకాలం సింగల్ గా ఉంటూ వచ్చిన అమల పాల్, జగత్ దేశాయ్ అనే ప్రముఖ ముంబై టాప్ మోస్ట్ బిజినెస్ మెన్ తో ప్రేమాయణం నడిపింది.

- Advertisement -
Amala Paul Sencod Marrige

గత కొంత కాలంగా సోషల్ మీడియా లో అతనితో కలిసి దిగిన కొన్ని రొమాంటిక్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ వచ్చిన అమల పాల్ నిన్న రాత్రి ఘనంగా బందు మిత్రుల సమక్షం లో వివాహం చేసుకుంది. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు నిన్న తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చెయ్యగా అవి బాగా వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా అమలాపాల్ కి ఫ్యాన్స్ నుండి శుభాకాంక్షల వెల్లువ కురుస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here