Lavanya Tripati : ఆ విషయంలో సమంతను ఫాలో అయిన లావణ్య త్రిపాఠి.. అవసరమా అంటున్న నెటిజన్లు..

- Advertisement -

Lavanya Tripati : టాలీవుడ్ స్టార్ కపుల్స్ లిస్టులో వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి జోడీ కూడా చేరింది. ఈ జంట ఇటలీలో వివాహం చేసుకుంది. ‘అందాల రాక్షసి’తో తెలుగు చిత్రసీమకు పరిచయమైన ఉత్తరాది భామ, సొట్టబుగ్గల సుందరి మెగా ఇంటి కోడలు అయ్యింది. పెళ్లిలో లావణ్య కాంచీపురం శారీ కట్టుకున్నారు.

Lavanya Tripati
Lavanya Tripati

అయితే… ఆ చీరకు ఓ ప్రత్యేకత ఉంది. దానిపై స్పెషల్ ఎంబ్రాయిడరీ చేయించారు ఆమె! అది ఏమిటో చూశారా? వరుణ్ తేజ్ ను మెగా ఫ్యామిలీ, ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగా ‘వరుణ్’ అని పిలుస్తారు. మరి, లావణ్యా త్రిపాఠిని ‘లావ్’ అని అంటుంటారు. రెండు ముద్దు పేర్లను కలిపి శారీ మీద తెలుగులో రాయించుకుని వాటి పక్కన ఇన్ఫినిటీ సింబల్ పెట్టారు లావణ్య త్రిపాఠి.ఇక గతంలో సమంత కూడా తన పెళ్లి చీరపై ఇలానే రాయించుకుంది. సమంత.. నాగచైతన్య అని చీర అంచు అంతా రాయించుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు సమంతను ఫాలో అవుతూ లావణ్య ఇలా చేయడంపై కొందరు అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటలీలో జరిగిన వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి పెళ్లికి ఇండియా నుంచి సుమారు 120 మంది వరకు వెళ్లారు. అందులో మెగా కుటుంబంలో సభ్యుల సంఖ్య 50 వరకు ఉందని తెలిసింది. నితిన్, నీరజా కోన వంటి స్నేహితులు కొందరు, లావణ్యా త్రిపాఠి కుటుంబ సభ్యులు ఉన్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here