హీరోయిన్ Samantha చాలా కాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. కొంత కాలం పాటు ఈ వ్యాధికి చికిత్స తీసుకున్న ఆమె, ఆ తర్వాత సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలోనూ నటించింది. కొద్ది కాలం క్రితం మూవీస్ కు పూర్తి స్థాయిలో విరామం ప్రకటించింది. కంప్లీట్ గా తన హెల్త్ మీదే ఫోకస్ పెట్టింది. మయోసైటిస్ నుంచి బయటపడటంతో పాటు మానసిక ప్రశాంతంత పొందేందుకు ప్రయత్నిస్తోంది. సమంత తరచుగా ఫారిన్ వెకేషన్స్ కు వెళ్తూ మానసిక ఉల్లాసాన్ని పొందుతోంది.
రీసెంట్ గా బాలిలో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేసింది. తన మిత్రులతో కలిసి సరదాగా గడుపుతూ కనిపించింది. కొద్ది కాలం పాట అమెరికాలోనూ ట్రీట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా తన హెల్త్ కు సంబంధించి సమంత ఓ చిన్న అప్ డేట్ ఇచ్చింది. ఈ మేరకు ఆమె ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం కైరో థెరపీ చేయించుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ ట్రీట్మెంట్ కు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టా స్టేటస్ లో షేర్ చేసింది. ఇందులో ఆమె పొగలు కక్కే చిలో ఓ టబ్ లో కూర్చుని కనిపించింది.
చలి తీవ్రత -150 డిగ్రీల ఫారెన్ హీట్ ఉన్నట్లు అక్కడ డిస్ ప్లే లో కనిపిస్తోంది. “వ్యాధి కారక క్రిములతో పోరాడే తెల్ల రక్తకణాలు కైరో థెరపీతో పెరుగుతాయి. రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చేసి, దేహం అంతా హీలింగ్ కాంపౌండ్స్ ను సరఫరా చేస్తుంది. మెంటల్ హెల్త్ తో పాటు శక్తిని కూడా అందిస్తుంది. శరీరంలో పలు కీలక మార్పులు చేస్తూ చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తుంది” అని సమంతా వెల్లడించింది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు నిత్యం వ్యాయామాలు చేస్తూ కనిపిస్తోంది.