Ram Pothineni : ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘స్కంద’ భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. బోయపాటి పైత్యానికి పరాకాష్ట గా ఈ సినిమా నిల్చింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ తిట్టుకున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యింది.
సినిమా థియేటర్స్ లో విడుదలైనప్పుడు వచ్చిన ట్రోల్ల్స్ కి డబుల్ , ట్రిపుల్ ట్రోల్ల్స్ ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత ఈ సినిమా సొంతం చేసుకుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. బోయపాటి దర్శకత్వం ని నెటిజెన్స్ వెక్కిరించడమే కాకుండా, ఎన్నో సన్నివేశాల్లో ఆయన చేసిన తప్పులను కూడా ఎత్తి చూపుతూ సోషల్ మీడియా లో తెగ రోస్ట్ చేసేసారు ఆడియన్స్.
దీనికి హీరో రామ్ బాగా హర్ట్ అయ్యాడు. ఈ సినిమాలోని ఒక సన్నివేశం లో రామ్ తెల్ల చొక్కా మరియు పంచె వేసుకొని ఒక భారీ యాక్షన్ సన్నివేశం చేస్తాడు. ఈ సన్నివేశం ప్రారంభం లో ఉన్నది రామ్ కాదు, బోయపాటి శ్రీను, కావాలంటే మేకింగ్ వీడియో ని చూడండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆధారాలతో సహా అప్లోడ్ చేసారు. ఇది బాగా వైరల్ అయ్యి రామ్ వరకు చేరడం తో ఆయన చాలా ఎమోషనల్ గా దీనిపై స్పందించాడు.
ఆయన మాట్లాడుతూ ‘ నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. ఈ సన్నివేశం ని మేము పీక్ సమ్మర్ లో, నిటారు ఎండలో 25 రోజుల పాటు షూట్ చేసాము. ఈ ఫొటోలో కనిపిస్తున్న పాదం నాదే, చూడండి ఎలా అయ్యిందో. ఇప్పటికీ నేను సరిగా నడవలేకపోతున్నాను. ఆ షాట్ పర్ఫెక్ట్ గా రావాలి అని బోయపాటి శ్రీను గారు ఒక రఫ్ షాట్ చేసి చూపించారు. మీరు సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నది ఆ ఫోటోనే. సినిమా నచ్చిందా నచ్చలేదా అనేది ఆడియన్స్ ఛాయస్, నేను వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తాను, కానీ పడిన కష్టాన్ని ఇలా అవహేళన చెయ్యడం సరికాదు’ అంటూ చెప్పుకొచ్చాడు హీరో రామ్.
22.04.23 I still remember..it was one of the hottest days during the peak of summer..this was my feet after filming this episode on the 3rd day of the 25days..couldn’t walk properly..went away for a bit after it started to bleed..so My Director wanted to get the shot right n did… https://t.co/8cSOTW2H7b pic.twitter.com/4DXF0DYDFn
— RAm POthineni (@ramsayz) November 4, 2023