Varun Tej – Lavanya Tripathi మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

- Advertisement -

Varun Tej – Lavanya Tripathi : టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ ప్రేమ జంట గా పేరు తెచ్చుకున్న వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి రీసెంట్ గానే ఇటలీ లో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. చూడ ముచ్చటగా ఉన్న ఈ జంటని చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

Varun Tej - Lavanya Tripathi
Varun Tej – Lavanya Tripathi

ఇక టాలీవుడ్ లో రూలర్స్ లాగ కొనసాగుతున్న మెగా హీరోలందరినీ ఒకే చోట చూసి ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. ఇకపోతే ఈ పెళ్ళికి సంబంధించి సోషల్ మీడియా లో ఇప్పటి వరకు ఎన్నో కథనాలు వచ్చాయి. వాటిల్లో ఏది నిజం ఏది అబద్దం అనేది కాసేపు పక్కన పెడితే, ఈ జంట మధ్య ఉన్న వయస్సు తేడా ని చూసి ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు, ఇంతకీ ఆ కథ ఏంటో చూద్దాం.

Varun Tej - Lavanya Tripathi Marriage

సాధారణంగా ఏ జంట మధ్య అయినా వయస్సు తేడా ఏడాది, లేదా రెండు మూడు ఏళ్ళు ఉండొచ్చు. కొన్ని జంటల మధ్య అయితే నాలుగు నుండి 7 సంవత్సరాల వయస్సు తేడా కూడా ఉంది. కానీ వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంత అరుదుగా ఏ జంట మధ్య కూడా ఉండదు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

- Advertisement -
Varun Tej - Lavanya Tripathi Niharika

వీళ్లిద్దరి మధ్య ఉన్న వయస్సు తేడా కేవలం 11 నెలలు మాత్రమేనట. వరుణ్ తేజ్ జనవరి 11 , 1990 వ సంవత్సరం లో జన్మిస్తే, లావణ్య త్రిపాఠి డిసెంబర్ 15 , 1990 వ సంవత్సరం లో పుట్టింది. ఇలా ఇద్దరు ఒకే ఏడాది జన్మించడం, వాళ్లిద్దరూ కలిసి పెళ్లి చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి జంట ఆ విధంగా స్పెషల్ జోడి అన్నమాట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here