JR NTR : సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా మరియు కమెడియన్ మంచి పేరు తెచ్చుకున్న నటుడు శ్రీనివాస్ రెడ్డి. ఈయన ఇండస్ట్రీ లో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించాడు. ప్రతీ ఒక్కరితో శ్రీనివాస్ రెడ్డి కి మంచి సాన్నిహిత్యం ఉంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ తో శ్రీనివాస్ రెడ్డి కి ఉన్న సాన్నిహిత్యం ఎంతో ప్రత్యేకమైనది. టీడీపీ పార్టీ కి ఎన్నికల ప్రచారం చేస్తున్న రోజుల్లో ఎన్టీఆర్ కి కారు ప్రమాదం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ ప్రమాదం గురించి శ్రీనివాస్ రెడ్డి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ఎన్టీఆర్ ప్రచారం చేస్తున్న రోజుల్లో తనకి ఎంతో సన్నిహితమైన వారిని కూడా తన ప్రచారం లో పాల్గొనమని చెప్పేవాడట. అలా ఒక్కో రోజు ఒక్క స్నేహితుడు ఎన్టీఆర్ ప్రచారం లో పాల్గొనేవారట. అలా ఖమ్మం లో ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు ప్రముఖ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నాడట.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఇక ఆ రోజు ఎన్నికల ప్రచారం మొత్తం పూర్తి అయ్యి తిరిగి వెళ్తున్న సమయం లో ఎన్టీఆర్ ఒక కార్ లో వెళ్తున్నాడు. నన్ను కూడా ఆ కార్ లో రమ్మన్నాడు. నేను బ్యాగ్ తీసుకొని వచ్చే లోపు ఆ కార్ లో మరో వ్యక్తి ఎక్కడం తో నన్ను వెనకాల ఉన్న కార్ లో ఎన్టీఆర్ రమ్మన్నాడు. అలా వెళ్తున్న సమయం లో ఎన్టీఆర్ కార్ రోడ్డు ప్రమాదానికి గురి అయ్యింది. ఎన్టీఆర్ కి బాగా దెబ్బలు తగిలి శరీరం మొత్తం రక్తం తో నిండిపోయింది.
ఇది గమనించిన నేను వెంటనే నా బ్యాగ్ లో ఉన్న టవల్ తో ఎన్టీఆర్ కి దెబ్బ తగిలిన చోట కట్టుకట్టి, సమీపం లో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించాను. ఆ తర్వాత ఆయన్ని సిటీ లో ఉన్న హాస్పిటల్ కి తరలించాము. ఆరోజు నేను అక్కడ ఉండడం వల్లే ఎన్టీఆర్ ప్రాణాలను కాపాడగలిగాను, కానీ నేను అంటే పడని కొంతమంది, నేను ప్రచారం లో పాల్గొనడం వల్లే ఎన్టీఆర్ కి ప్రమాదం జరిగింది అంటూ ప్రచారం చేశారు. ఇది నా మనసుకి బాగా బాధని కలిగించింది’ అంటూ ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చాడు.